Home » సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న 7గురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీరే…!

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న 7గురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీరే…!

by AJAY
Published: Last Updated on

Tollywood Heroines : చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సావిత్రి. హీరో జెమినీ గణేశ‌న్ ను సావిత్రి ర‌హ‌స్య‌ వివాహం చేసుకుంది. అప్పటికే జెమినీ గణేషన్ కు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు.

 

స్టార్ హీరోయిన్ శ్రీదేవి మొదట హీరో మితున్ చక్రవర్తి ని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంది. మూడేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బోణికపూర్ తో ప్రేమలో పడిన శ్రీదేవి ఆయ‌న‌ను ప్రేమ‌ వివాహం చేసుకుంది.

ముద్దుల మామయ్య సినిమాలో బాలకృష్ణ కు చెల్లిగా నటించిన నటి సీత. ఆ తర్వాత కోలీవుడ్ లో సీత అనేక చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. సీత మొదట ఓ నటుడిని వివాహం చేసుకుంది. కొంతకాలానికి వీరు విడిపోయారు. ఆ తర్వాత 2010లో సీరియల్ నటుడు సతీష్ ను సీక్రెట్ గా రెండో వివాహం చేసుకుంది.

బిచ్చగాడు సినిమా హీరోయిన్ సాత్నా టైటస్. ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా బయ్యర్ కార్తీక్ ను రహస్యంగా వివాహం చేసుకుంది.

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన హీరోయిన్ శ్రియ సరన్. ఈ ముద్దుగుమ్మ రష్యా కు చెందిన ఆండ్రి కోషివ్ ను రహస్యంగా ప్రేమ వివాహం చేసుకుంది.

టాలీవుడ్ నటి రమ్యకృష్ణ కూడా రహస్య వివాహం చేసుకుంది. రమ్యకృష్ణ కృష్ణవంశీ ఇద్దరూ ఒక గుడిలో 2003లో వివాహం చేసుకున్నారు.

సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించిన హీరోయిన్ దేవయాని. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది దేవయాని అలరించింది. దర్శకుడు రాజ్ కుమార్ ను దేవయాని ప్రేమ వివాహం చేసుకుంది.

Also read :

Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?

పెళ్లి వేదిక‌పై కొట్టుకున్న వ‌ధూవ‌రులు.. కార‌ణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

Visitors Are Also Reading