మంగళవారం ఏదైనా పనిమొదలపెడదామంటే పెద్దలు అస్సలు ఒప్పుకోరు. మంగళవారం పని మొదలు పెడతావా అంటూ సీరియస్ అవుతారు. మంగళవారాన్ని మహా చెడ్డరోజుగా చూస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు..ఎవైనా ముఖ్యమైన కార్యక్రామాలు చేయాల్సి ఉన్నా వాయిదా వేసుకుంటారు. అయితే ఒకప్పుడు పండితులు మంగళవారం ఎలాంటి పనులు పడితే అలాంటి పనులు చేయకూడదని కానీ మంచి పనులు చేయవచ్చని చెప్పారట.
కానీ మనవాళ్లు మాత్రం మంగళవారం అసలు ఎలాంటి పనులు చేయకూడది…మంగళవారం భూత పిశాచాలు తిరిగేవారమని భయపడిపోయాని అందువల్లే ఎలాంటి పనులు చేయకూడదని ఫిక్స్ అయిపోయినట్టు జోతిష్య నిపుణులు చెబుతున్నారు. కానీ శాస్త్రం మాత్రం మంగళవారం మంచిపనే చేయాలని చెబుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి మంగళవారం మారు కోరుతుందట…ఊదాహరణకు మంగళవారం బ్యాంకులో డబ్బులు వేస్తే మళ్లీ మంగళ వారం బ్యాంకులో డబ్బులు వేసేటంత మంచి జరుగుతుందట.
also read : ఈ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా..? అయితే కష్టాలు తప్పవు..!
అదే విధంగా మంగళవారం గాజులు కొనుక్కుంటే మళ్లీ మంగళవారం గాజులు కొనుక్కునేటంత సౌభాగ్యం చేకూరుతుందట. కాబట్టి మంగళవారం మంచి పనులు చేయవచ్చని కానీ పిచ్చి పనులు పనికిమాలిన పనులు అస్సలు చేయకూడదని శ్రాస్త్రం చెబుతున్నట్టు జోతిష్య నిపుణులు పేర్కొన్నారు. చెడుపనులు చేయడానికి ముహూర్తాలు చూసుకోవాలి గానీ మంచి పనులు చేయడానికి ముహూర్తాలు అవసరం లేదని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.