Telugu News » Blog » ఈ వ‌స్తువులు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెడుతున్నారా..? అయితే క‌ష్టాలు త‌ప్ప‌వు..!

ఈ వ‌స్తువులు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెడుతున్నారా..? అయితే క‌ష్టాలు త‌ప్ప‌వు..!

by AJAY
Ads

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులను వ్రాంగ్ ప్లేస్ లో ఉంచడం వల్ల కూడా ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. దాంతో కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంట్లో డబ్బులు ఉండకపోవడం, అనారోగ్య సమస్యలు మరియు ఇతర సమస్యలు వచ్చి పడుతూనే ఉంటాయి. కాబట్టి ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో వాస్తుశాస్త్రజ్ఞులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

Advertisement

vasthu tips

vasthu tips

చెత్త కుండి
చాలామంది చెత్త కుండి ని ఇంటి లోపల పెడతారు. కానీ దానిని ఎప్పుడూ ఇంటి బయట ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉంటే అది ప్రతికూల ప్రభావాన్ని తీసుకు వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ కచ్చితంగా ఇంట్లో పెట్టాల్సి వస్తే కచ్చితంగా చెత్త కుండీ పై మూత పెట్టాలని చెబుతున్నారు.

ఇంట్లో ఉండే మొక్కలు

Advertisement

నగరాలు పట్టణాలలో కొంతమంది ఇంట్లో మొక్కలను పెంచుతూ ఉంటారు. అయితే ఎండిపోయిన మొక్కను ఇంట్లో ఉంచకూడదు. ఒకవేళ ఎండిపోయిన తర్వాత మొక్క ఇంట్లో ఉంటే అవి చెడు సంకేతమని చెబుతున్నారు. కాబట్టి ఎండిపోయిన మొక్క ఉంటే దానిని వెంటనే బయటపెట్టాలని చెబుతున్నారు.

ఇంటి పైకప్పుపై చెత్త ఉండడం

ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా ఇంటి పరిశుభ్రత పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో కొంతమంది ఇంటి పై కప్పు పైన కూడా చెత్త అలాగే ఉండిపోతుంది. అంతే కాకుండా ఇంట్లో పనికిరాని వస్తువులను వ్యర్ధాలను కూడా ఇంటిపై పెడుతుంటారు. అయితే ఇంటి పై కప్పు పై అలాపనికిరాని వస్తువులను ఉంచకూడదని చెబుతున్నారు. వాటి వల్ల ఇంట్లో విద్వేషాలు, కష్టాలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఏ పని చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోతుందని అంటున్నారు.

ఇంట్లో పనికిరాని వస్తువులు ఉండటం

పాత వస్తువులను కూడా కొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటారు. దానితో ఎలాంటి ఉపయోగం లేకపోయినా ఇంట్లో ఓ మూలన పడేస్తారు. చిరిగిన బట్టలు, విరిగి పోయిన వస్తువులు అలా రకరకాల వస్తువులను ఇంట్లోనే పెడుతుంటారు. అలాంటి వస్తువులు కూడా వీలైనంత త్వరగా బయటపడేయాలని వాస్తునిపుణులు చెబుతున్నారు. అవి అభివృద్ధికి ఆటంకంగా మారతాయని… అదృష్టాన్ని అడ్డుకుంటాయని అంటున్నారు.