Home » తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త…TSSPDCL లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త…TSSPDCL లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కార్. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా డిసెంబర్ కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

Advertisement

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ లోబ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తిర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మార్చి 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.320 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫీజు చెల్లించినవసరం లేదు. రాతపరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్ 30న జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.64,295 నుంచి రూ.99,345 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

READ ALSO : నారా వారి క్షుద్ర పూజలకు..తారక్ బలి – శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Visitors Are Also Reading