మామిడి పండ్లు అంటే నోరూరని వారు ఉండనే ఉండరు. వేసవికాలంలో లభించే ఈ మామిడి పండ్లకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మామిడిపండ్లలో పలు రకాలుంటాయి. ముఖ్యంగా నూజివీడు, బంగినపల్లి, రసాలు, కోత మామిడి అంటూ రకరకాల పేర్లుంటాయి. అన్నింటికంటే ఎక్కువగా ప్రజాదారణ పొందిన జగిత్యాల బంగినపల్లి మాడిపండ్లను తినేందుకు అంత దూరం వెళ్లి కొనలేని వారి కోసం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
Advertisement
ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా జగిత్యాల బంగినపల్లి మామిడిపండ్లను వినియోగదారుల వద్దకే చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. బుక్ చేసిన వారం రోజల్లో మీ ఇంటి వద్దకు మామిడి పండ్లను చేర్చుతుంది. ముఖ్యంగా బంగినపల్లి మామిడి పండ్లకు తెలంగాణతో పాటు ఏపీ, ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. దానిని క్యాష్ చేసుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ భావిస్తుంది. వినియోగ దారుల ఇండ్ల వద్దకే మామిడి పండ్లను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
Advertisement
అయితే ఒక కేజీ మామిడిపండ్లు రూ.115కు అందిస్తారు. కనీసం 5 కిలోల పండ్లను ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. 5, 10, 15 కేజీల నుంచి 10 టన్నుల వరకు బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో పండ్లను కార్గో పార్సిల్ సేవల ద్వారా మీ ఇంటికి చేర్చుతారు. జంట నగరాలలోని కాలనీ, అపార్ట్‌మెంట్ వాసులు సామూహికంగా ఆర్డర్ చేస్తే కార్గో బస్సుల ద్వారా నేరుగా ఆయా ప్రాంతాలకే పంపుతామని ఎండీ సజ్జనార్ వెల్లడించారు. పూర్తి వివరాలకు www. tsrtcparcel.in లేదా 040-23450033, 040-69440000 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Also Read :
ఇంట్లో ఆడవారు 9 లవంగాలు, ఉప్పుతో ఇలా చేస్తే మీ దోషాలన్నీ తొలగిపోతాయి..!!
టీఎస్ లో గ్రూప్ 1, పోలీసు ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం.. అప్లై చేసుకోండిలా..!!