Home » టీఎస్ లో గ్రూప్ 1, పోలీసు ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం.. అప్లై చేసుకోండిలా..!!

టీఎస్ లో గ్రూప్ 1, పోలీసు ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం.. అప్లై చేసుకోండిలా..!!

Ad

తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ విధంగానే మొదటగా పోలీస్ మరియు గ్రూపు 1ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి సోమవారం రోజున దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు కాబట్టి చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు గ్రూప్1 కు సంబంధించి సోమవారం సాయంకాలం వరకు 3895 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఇక పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 15000 పైగా దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలియజేసింది.

Advertisement

Advertisement

దరఖాస్తు సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్త లేదని అధికారులు తెలియజేశారు. గ్రూప్ 1 సంబంధించి 5-8 నిమిషాల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. దరఖాస్తు చేసుకున్నటువంటి కొంతమంది అభ్యర్థులకు ఉన్నతాధికారులు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోగా ఎలాంటి సమస్య లేదని సంతృప్తిగా ఉన్నామని వారు తెలియజేశారు. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 20వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. గ్రూప్ 1 కు సంబంధించి ఈ నెల 31 చివరి తేదీగా ప్రకటించారు. అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నిర్ణీత తేదీల్లో అప్లై చేసుకోవాలని అన్నారు.

గ్రూప్ 1కు సంబంధించిన అభ్యర్థులు టిఎస్పిఎస్సి అధికారిక వెబ్ సైట్ అయిన https://www.tspsc.gov.in/ పోలీస్ దరఖాస్తు సంబంధించి అభ్యర్థులు https://www.tslprb.in/, దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈ తరుణంలో సైబర్ నేరగాళ్లు కూడా ఇలాంటి వెబ్ సైట్ లోనే ఫేక్ సృష్టించి అభ్యర్థులను బోల్తా కొట్టిస్తారు అని కాబట్టి దరఖాస్తుదారులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏసీపీ కె వి ఎం ప్రసాద్ సూచించారు.

ALSO READ;

మధ్యాహ్నం నిద్ర పోవడం మంచిదేనా…?

అబార్ష‌న్ చ‌ట్టంపై అమెరికా సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం..!

 

Visitors Are Also Reading