Home » TSPSC New Notification: గుడ్ న్యూస్.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల..

TSPSC New Notification: గుడ్ న్యూస్.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల..

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కారు. ఇక తాజాగా మరోసారి విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

Advertisement

సంక్షేమ హాస్టల్లలో ఖాళీగా ఉన్న 581 పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ట్రైబల్, బీసీ సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులు, దివ్యాంగ్, సీనియర్ సిటిజన్ విభాగంలో వార్డెన్, మెట్రన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 581 పోస్టులకు జనవరి 6, 2023 నుంచి జనవరి 27వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిలో కింద తెలిపిన విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 1 అండ్ 2, మాట్రాన్ గ్రేడ్ 1 అండ్ 2, వార్డెన్ గ్రేడ్ 1 అండ్ 2, లేడీ సూపరింటెండెంట్, చిల్డ్రన్ హోమ్ విభాగాల్లో ఈ పోస్టును భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ లో పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in లో చూడవచ్చని పేర్కొన్నారు.

Advertisement

అటు185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 30 నుంచి జనవరి 19 వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 22 హార్టికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడింది. జనవరి 3 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.

READ ALSO : విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తుల వివరాలు… ఆమె దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే!

Visitors Are Also Reading