Telangana State Ration Dealer Jobs 2022: తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో, 27 చౌకధరల దుకాణం డీలర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Advertisement
Telangana Ration Dealer Jobs 2022
Telangana State Ration Dealer Jobs 2022
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత గ్రామపంచాయతీలో నివాసి అయ్యి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సి, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో జనవరి 6, 2023వ తేదీ లోపు అదిలాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో అందజేయాలి.
Advertisement
Jobs Notifications in Telangana 2023
దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా రూ.1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష జనవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ జనవరి 27న ఉంటుంది. రాత పరీక్ష 80 మార్కులకు, ఇంటర్వ్యూ 20 మార్కులకు కలిపి మొత్తం 100 మార్కులకు నియామక ప్రక్రియ ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం : Click Here
Advertisement
READ ALSO : ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..అప్లై చేసుకోండి ఇలా !