Telugu News » Blog » Jobs in Railway: ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..అప్లై చేసుకోండి ఇలా !

Jobs in Railway: ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..అప్లై చేసుకోండి ఇలా !

by Bunty
Ads

Jobs in Railway: దేశం లో నిరుద్యోగం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి సమయంలో రైల్వేలో ఉద్యోగం కోరుకుంటున్న నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. Railway Jobs దక్షిణ రైల్వే వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2 జనవరి 2023. ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక సైట్ iroams.com ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Jobs in Railways

Railway Jobs notification 2022

అర్హత
12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు 7వ CPC పే మ్యాట్రిక్స్ స్థాయి 2/3 లో పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మాత్రమే 7వ CPC పే మ్యాట్రిక్స్ స్థాయి 4/5 లో పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Railway Jobs notification 2022

Railway Jobs notification 2022

వయోపరిమితి
అభ్యర్థి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు కూడా నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు
జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు, పిడబ్ల్యుడి, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మరియు ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు ఫీజు రూ.250గా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లింపు చేయవచ్చు.

Advertisement

READ ALSO : ఇండియాలో 7 రోజులపాటు లాక్‌డౌన్‌..! వైరల్ అవుతోన్న వీడియో..?

You may also like