Home » కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తెరాస మాజీ ఎమ్మెల్యే.. ఎవరంటే..?

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తెరాస మాజీ ఎమ్మెల్యే.. ఎవరంటే..?

by Sravanthi
Ad

తెరాసకు ఉత్తర తెలంగాణలో ఊహించని షాక్ తగిలింది అని చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టువంటి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో నల్లాల ఓదేలు ఆయన భార్య ఆదిలాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి పార్టీలో చేరారు. వీరితో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర రాజనర్సింహ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వీరితో పాటు ఢిల్లీ వెళ్లారు.రాబోయే ఎన్నికల్లో ఆయనకు చెన్నూరు నుంచి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. తనకు గౌరవం లేని దగ్గర ఉండలేనని అందుకే తెరాసను వదిలి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు నల్లాల ఓదెలు తెలియజేశారు. ఆయన టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. 2009 2014 ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 లో మాత్రం ఆయనకు టిఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. ఈయనకు బదులుగా టికెట్ ను బాల్క సుమన్ కి ఇచ్చారు. దీంతో అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న నల్లాల ఓదెలు నాకు గౌరవం లేని దగ్గర ఉండలేను అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కూడా ఆయనకు చాలా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విభేదాలను ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు చెప్పినా అంతగా ప్రయోజనం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

పాకిస్థాన్ కు ఫైన్ కడుతున్న న్యూజిలాండ్… ఎందుకంటే…?

హీరో బాలకృష్ణ ఇంటి గేటును ఢీ కొట్టిన కారు.. వీడియో వైరల్..?

 

Visitors Are Also Reading