Home » హీరో బాలకృష్ణ ఇంటి గేటును ఢీ కొట్టిన కారు.. వీడియో వైరల్..?

హీరో బాలకృష్ణ ఇంటి గేటును ఢీ కొట్టిన కారు.. వీడియో వైరల్..?

by Sravanthi Pandrala Pandrala

సినీ హీరో బాలకృష్ణ ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం సమయంలో ఒక మహిళ కారుతో ఆయన ఇంటి గేటును ఢీ కొట్టి అనంతరం అక్కడే పెన్సింగ్ కు ఢీకొని కారు ఆగిపోయింది. దీంతో అక్కడ చాలా సేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అసలు ఆ ప్రమాదం ఎందుకు జరిగింది. ఢీ కొట్టింది ఎవరు.. అనేది ఓ సారి చూద్దాం..?హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 లో ఒక మహిళ మహీంద్ర కంపెనీ కి చెందినటువంటి కార్ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న అంబులెన్స్ కు దారి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె కార్ స్పీడ్ మరింత పెంచి ముందుకు వెళ్ళింది. దీంతో కంట్రోల్ కాకా ఆ పక్కనే ఉన్న డివైడర్ పైకి కారు వెళ్లి అనంతరం దాని పక్కన ఉన్న బాలకృష్ణ ఇంటి గేటు వద్ద ఢీ కొట్టింది. అలాగే దూసుకుపోతూ పక్కనే ఉన్నటువంటి పెన్సింగ్ కు తాకి ఆగిపోయింది.అది స్టార్ హీరో ఇల్లు కాబట్టి అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం చాలామంది గుమికూడారు. దీంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులు ట్రాఫిక్ ను తొలగించి, ఆ మహిళకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. కానీ ఆమె మద్యం తీసుకోలేదని వెల్లడైంది. ఈ క్రమంలో ఆమె అంబులెన్స్ కు దారి ఇవ్వడం కోసం స్పీడ్ గా వచ్చానని కారు కంట్రోల్ కాక అలా జరిగిందని పోలీసులకు వివరణ ఇచ్చింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ;

భ‌ర్త‌తో లిప్ లాక్ ఫోటోను షేర్ చేసిన నిహారిక‌…నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

పెప్సీ కోకాకోలా ల ఈ లొల్లి గురించి మీకు తెలుసా? దీని నుండి మ‌న‌మేం నేర్చుకోవాలి?

 

Visitors Are Also Reading