Home » “గే సినిమా” అంటూ ఆర్ఆర్ఆర్ పై నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

“గే సినిమా” అంటూ ఆర్ఆర్ఆర్ పై నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

by AJAY
Ad

రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ హీరోలుగా జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాను డీవివి దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో చ‌ర‌ణ్ కు జోడిగా అలియా భ‌ట్ న‌టించ‌గా ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మోరిస్ న‌టించింది. సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టులు ఉండ‌టమే కాకుండా భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమాలోని యాక్ష‌న్ స‌న్నివేశాలు విజువల్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లోనే ఉన్నాయి.

Advertisement

ఇక దేశ‌వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకు క‌లెక్షన్ల వ‌ర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమాను ఇంగ్లీష్ లోనూ ఇత‌ర దేశాల్లో విడుద‌ల చేశారు. అక్క‌డ కూడా కొంత‌మంది ఈ సినిమాకు ఫిదా అవ్వ‌గా మ‌రికొంద‌రు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చ‌రణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మధ్య అన్న‌ద‌మ్ముల్లాంటి బంధం తో పాటూ కంట‌త‌డి పెట్టించే ఎమోష‌న‌ల్ సన్నివేశాలు ఉంటాయి.

Advertisement

అయితే ఈ సినిమా చూసిన కొంత మంది వెస్ట్ర‌న్ ప్రేక్ష‌కులు ఇది గే సినిమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో యాక్ష‌న్ బాగుంది. గ్రాఫిక్స్ క‌థ కూడా బాగున్నాయి. కానీ ఇది ఒక గే సినిమా అని ఎందుకు ముందే చెప్ప‌లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజ‌న్ త‌న ట్వీట్ లో ఆర్ఆర్ఆర్ స్వలింగ సంప‌ర్కుల ప్రేమ‌. సినిమాలోని రెండు పాత్ర‌లూ గే కెమిస్ట్రీని ఆస్వాదించాయి.

ఆర్ఆర్ఆర్ స్వ‌లింగ సంప‌ర్కుల మ‌ధ్య బంధాన్ని చ‌క్క‌గా వివ‌రించింది. అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక ఇలా ట్రోల్ చేస్తున్న వారికి ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కూడా త‌మ‌దైన స్టైల్ లో రిప్లై లు ఇస్తున్నారు. మీకు అలాంటి సినిమాలు చూడ్డం అల‌వాటైపోయింది అందుకే అలా క‌నిపిస్తుంది అంటూ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రియులు వెస్ట్ర‌న్ ప్రేక్ష‌కుల‌కు రిప్లై లు ఇస్తున్నారు.

ALSO READ :

అక్కినేని ఫ్యాన్స్ కు షాక్…నాగార్జున ప్లేస్ లోకి స‌మంత‌…?

Visitors Are Also Reading