Home » అక్కినేని ఫ్యాన్స్ కు షాక్…నాగార్జున ప్లేస్ లోకి స‌మంత‌…?

అక్కినేని ఫ్యాన్స్ కు షాక్…నాగార్జున ప్లేస్ లోకి స‌మంత‌…?

by AJAY
Ad

టాలీవుడ్ బ్యూటీ స‌మంత మ‌ల్టీ టాలెంటెడ్ అన్న సంగ‌తి తెలిసిందే. న‌ట‌న‌లో అయినా డ్యాన్స్ లో అయినా స‌మంత మిగితా హీరోయిన్ ల‌కు పోటీని ఇస్తుంది. అంతే కాకుండా హోస్ట్ గా కూడా స‌మంంత ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజ‌న్ 4 లో హోస్ట్ నాగార్జున త‌న బ‌ర్త్ డే స‌మ‌యంలో టూర్ కు వెళ్ల‌డంతో అప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గా స‌మంత చేసింది.

Advertisement

ఆ ఎపిసోడ్ కు అథ్య‌ధిక రేటింగ్ వ‌చ్చింది. అంతే కాకుండా స‌మంత హోస్టింట్ స్టైల్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. మ‌రో వైపు ఆహాలో స‌మంత టాక్ షోతో కూడా ఆక‌ట్టుకుంది. ప‌లువురు స్టార్ ల‌ను స‌మంత ఇంట‌ర్వ్యూ చేయ‌గా ఆ షో కూడా ఎంతో స‌క్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు స‌మంత మ‌రోసారి హోస్ట్ గా రాబోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే బిగ్ బాస్ సీజ‌న్ 5 పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఈ సీజ‌న్ ఓటిటిలో ప్ర‌సారం కాగా ప్రేక్ష‌కాద‌ర‌ణ లేకుండా పోయింది. ఈ సీజ‌న్ అస‌లు ప్రేక్ష‌కులు ఎవ‌రూ పట్టింకోలేదు. దాంతో ఇప్పుడు సీజ‌న్ 6ను మ‌ళ్లీ టీవీలోనే ప్రసారం చేయాల‌ని బిగ్ బాస్ యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంది. ఈ సీజ‌న్ లో సామాన్యుల‌కు అవ‌కాశం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సీజ‌న్ కు హోస్ట్ గా స‌మంత చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

నాగార్జున సినిమా షూటింగ్ ల కార‌ణంగా ఈ సీజ‌న్ నుండి త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో సీజ‌న్ 6 కు హోస్ట్ గా స‌మంత‌ను తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే స‌మంత నాగ‌చైత‌న్య తో విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దాంతో నాగ్ ప్లేస్ లో మ‌ళ్లీ ఆయ‌న మాజీ కోడ‌లు రాబోతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

ALSO READ :

టాలీవుడ్ లో విజ‌య‌శాంతిని దారుణంగా అవ‌మానించారు…సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టిన న‌టుడు..!

Visitors Are Also Reading