Home » Radhe Shyam Copied Scenes: ‘రాధే శ్యామ్’లోని ఈ సీన్ ని ఎక్కడనుంచి కాపీ చేసారంటే ?

Radhe Shyam Copied Scenes: ‘రాధే శ్యామ్’లోని ఈ సీన్ ని ఎక్కడనుంచి కాపీ చేసారంటే ?

by AJAY
Published: Last Updated on
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించ‌గా యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ పామిస్ట్రీ చెప్పే నిపుణుడిగా న‌టించాడు. ఇటలీ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెర‌కెక్కించారు.

Advertisement

సినిమాలోని పాట‌ల‌తో పాటూ గ్రాఫిక్స్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అయితే సినిమాకు మాత్రం మిక్స్డ్ టాక్ వ‌స్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా పామిస్ట్రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాను గతంలో వ‌చ్చిన రిలాక్స్ అనే సినిమా నుండి కాపీ కొట్టారంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. రిలాక్స్ సినిమాను కూడా పామిస్ట్రీ ఆధారంగా తెర‌కెక్కించారు.

Advertisement

Also Read: అప్పు మరణవార్త ఆమెకు ఇంకా చెప్పలేదట…!

అయితే ఈ సినిమాలో హీరో కాకుండా ఓ వ్య‌క్తి చేయి చూసి జ‌ర‌గ‌బోయేది చెబుతుంటాడు. ఇక ప్ర‌స్తుతం ఆ వీడియోను రాధేశ్యామ్ వీడియోతో జ‌త చేసి నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. దాంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ట్రోల్స్ పై ఫైర్ అవుతున్నారు. అస‌లు వీడియోకు రాధేశ్యామ్ కు సంబంధం ఉందా అని మండి ప‌డుతున్నారు. ఇక మ‌రికొంద‌రు కేవ‌లం రెండు సినిమాల‌ను కూడా పామిస్ట్రీ ఆధారం గా తెర‌కెక్కించారు. అంత‌కు మించి రెండు సినిమాల్లో కామ‌న్ పాయింట్స్ ఏమీ లేవుక‌దా అని చెబుతున్నారు.

Also Read: హోలీ పండుగ రోజు కామ ద‌హ‌నం ఎందుకు చేస్తారో తెలుసా..?

 

Visitors Are Also Reading