Telugu News » Blog » అప్పు మరణవార్త ఆమెకు ఇంకా చెప్పలేదట…!

అప్పు మరణవార్త ఆమెకు ఇంకా చెప్పలేదట…!

by AJAY
Ads

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీయడం తో పాటు తన చారిటీ ద్వారా సేవా కార్యక్రమాలు చేసి పునీత్ రాజ్ కుమార్ అభిమానులను సంపాదించుకున్నారు. కానీ గుండె పోటు రావడం తో ఆయన మరణించడం అందర్నీ విషాదం లోకి నెట్టింది.

Advertisement

Advertisement

ఇదిలా ఉండగా అప్పు మరణించి నెలలు గడుస్తున్నా కూడా ఆయన మరణ వార్తను ఇప్పటికీ ఆయన మేనత్త నాగమ్మకు (90) చెప్పలేదట. ఆమె అప్పు ను ఎంతో ఇష్టపడతారు. అంతే కాకుండా ఆమె ప్రస్తుతం వృద్ధాప్యం తో బాధపడుతున్నారు. అదే విధంగా గతంలో అప్పు అన్నయ్యకు గుండె పోటు రాగా ఆ విషయం తెలిసి నాగమ్మ అనారోగ్యం భారిన పడ్డారట. అందువల్లే అప్పు మరణ వార్త ఆమెకు ఇప్పటికీ చెప్పలేదట. పునీత్ అన్నదమ్ముల ను నాగమ్మ సొంత బిడ్డలా చూసుకునేవాళ్ళు.