Home » ఆహాలో త్రిష తొలి మ‌ల‌యాళ చిత్రం

ఆహాలో త్రిష తొలి మ‌ల‌యాళ చిత్రం

by Anji
Ad

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ప‌లు చిత్రాల‌లో న‌టించిన‌ది అందాల భామ త్రిష‌. మ‌ళయాళంలోకి మాత్రం చాలా ఆల‌స్యంగా అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తొలిసారిగా మ‌ళ‌యాళంలో చేసిన సినిమా ‘హేజూడ్ ‘2018లో ఫిబ్ర‌వ‌రి 02న విడుద‌ల అయింది. శ్యామ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో త్రిష స‌ర‌స‌న ప్ర‌ముఖ మ‌ళ‌యాళ న‌టుడు నివిన్ పాల్ హీరోగా న‌టించాడు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి అప్ప‌ట్లో మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. సినిమా ప్రారంభం అయ్యే కొచ్చిలోనే అయినప్ప‌టికీ.. త‌రువాత క‌థ గోవాకు మారుతుంది. హీరో జూడ్ కొచ్చి నుంచి త‌న తండ్రితో క‌లిసి అనుకోకుండా వ‌చ్చిన ఓ ఆస్తిని పొంద‌డానికి గోవాకు వెళ్ల‌డం, అక్క‌డ హీరోయిన్ క్రిస్ట‌ల్ తో ప‌రిచ‌యం కావ‌డం, ఆ ప‌రిచ‌యం ఎలా ప్రేమ‌గా మారింద‌న్నదే ఈ చిత్రం క‌థ‌.

Advertisement

త్రిష తొలి మలయాళ చిత్రం 'ఆహా'లో!

Advertisement

ఇక ఇందులో నివిన్ పౌల్ బుద్ధిమాద్యం ఉన్న యువ‌కునిగా న‌టించాడు. మేథ‌స్సులో అత‌నికి తిరుగు లేక‌పోయినా.. వ్య‌వ‌హారిక విష‌యాల్లో త‌న వ‌య‌స్సుకు త‌గ్గ పరిప‌క్వ‌త లేని యువ‌కుని పాత్ర‌ను పోషించాడు. ఆ కార‌ణంగా అతనికి స‌మాజం నుంచి తోటి వ్య‌క్తుల నుండి ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర‌వ్వ‌డంతో పాటు.. అత‌ను ఈ సమాజం నుంచి తోటి వ్య‌క్తుల నుంచి స‌మ‌స్య‌ల‌ను ఏవిధంగా అధిగ‌మిస్తూ ముందుకు సాగాడు అనేదే ఈచిత్రం. సిద్ధిక్‌, నీనా కురూప్‌, విజ‌య్ మీన‌న్, అపూర్వ‌బోస్‌, అజూవ‌ర్గీస్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రంలోని నాలుగు పాట‌ల‌కు న‌లుగురు సంగీత ద‌ర్శ‌కులు స్వ‌రాలు స‌మ‌కూర్చ‌డం విశేషం. ఈ సినిమా తెలుగు డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్ ఆహాలో జ‌న‌వ‌రి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

Visitors Are Also Reading