Home » ఆ బ్యాట్స్‌మెన్‌ను భ‌య‌పెట్టిన పొలార్డ్‌.. అలా బ్యాటింగ్ చేస్తావా..?

ఆ బ్యాట్స్‌మెన్‌ను భ‌య‌పెట్టిన పొలార్డ్‌.. అలా బ్యాటింగ్ చేస్తావా..?

by Anji
Ad

కీర‌న్ పొలార్డ్ ఆధునిక క్రికెట్‌లో ప్ర‌పంచంలో అత్యుత్త‌మ ఆల్‌రౌండ‌ర్‌ల‌లో ఒక‌రిగా పేర్గాంచిన విష‌యం తెలిసిందే. భారీ సిక్స‌ర్‌ల‌ను కొట్ట‌గ‌ల అత‌ని సామ‌ర్థ్యాలు, పొట్టి ఫార్మాట్‌లో తుఫాన్ బ్యాట్స్‌మెన్‌గా మార్చాయి. అయితే బ్యాట్ తోనే కాదు బంతితో కూడా రాణిస్తుంటాడు ఈ వెస్టిండిస్ కెప్టెన్‌. 34 ఏళ్ల ఈ మీడియం పేస‌ర్ బౌలింగ్‌లోనూ ఆక‌ట్టుకుంటాన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ట్రినిటాడ్ టీ-10 బ్లాస్ట్ లీగ్ లో త‌న బౌలింగ్ తో నెట్టింట్లో నిలిచాడు.

Also Read :  IPL 2022 Promo : ఐపీఎల్ ప్రోమో విడుద‌ల‌..చెన్నై కెప్టెన్‌గా ధోనీ స్థానంలో జ‌డేజా..!

Advertisement

Advertisement

లెద‌ర్ బ్యాక్ జెయింట్స్ వ‌ర్సెస్ స్కార్లెట్ ఐబిస్ స్కార్చ‌ర్స్ మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన ఓ మ్యాచ్ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల‌వుతోంది. మ్యాచ్ సంద‌ర్భంగా విండిస్ స‌హ‌చ‌రుడు నికోల‌స్ పూర‌న్‌పై పోలార్డ్ ఆప్ స్పిన్ బౌలింగ్ చేయ‌డం ఈ వీడియోలో చూడ‌వ‌చ్చు. పొలార్డ్ బౌలింగ్ చేసేందుకు సిద్ధ‌మైన‌ప్పుడు ఎడ‌మ‌చేతి వాటం బ్యాట‌ర్ కూడా త‌న‌దైన శైలిలో స్పందించి.. ఎటాక్ కు సిద్ధ‌మ‌వ్వ‌డాన్ని కూడా ఈ వీడియోలో వీక్షించ‌వ‌చ్చు.

Visitors Are Also Reading