ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడు. ఆనందంగా సంసార జీవితాన్ని సాగిస్తున్నాడు. కొత్త దంపతులు చెట్టాపట్టాలేసుకొని తిరిగే సమయం అది.. తన భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నాడు. కానీ కాలం ఆ వ్యక్తి పై పగబట్టింది. కాలువ రూపంలో కాటేసింది.. తన భార్యకు కన్నీరునే మిగిలించింది.. పెళ్లి జరిగి ఐదు నెలలు కాకముందే ఆ జంట ఒంటరి అయింది.. అసలు విషయం ఏంటో చూద్దామా.. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనపల్లి వారి యొక్క సొంత ఊరు.
Advertisement
Also Read:Adipurush : ఆది పురుష్ కు అరుదైన గౌరవం…
గుగులోతు రాములు కళమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద వ్యక్తి గుగులోతు చరణ్(29) ఐదు నెలల క్రితమే పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లె ఎల్లమ్మ గడ్డకు చెందిన ఉమాతో ఘనంగా వివాహమైంది. చరణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే పెద్ద వంగర మండలంలోని గట్లకుంట శివారు ఒక తండాలో తన బంధువు ఒకరు మృతి చెందారట. దీంతో తన తల్లిదండ్రులతో కలిసి అంత్యక్రియలకు వెళ్లారు చరణ్.
Advertisement
Also Read:మొలకెత్తిన గింజల వల్ల నష్టమా ? లాభమా ?
అనంతరం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పక్కనే ఉన్నటువంటి ఎస్సారెస్పీ కాలువలోకి వెళ్లి, కాలుజారి అందులో పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు రక్షించేందుకు తాడు సహాయంతో ప్రయత్నించిన ఈత రాకపోవడంతో నీటి ప్రభావంలో కొట్టుకుపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడికి ఇద్దరు చెల్లెలు , భార్య ఉమ ఉంది. కొత్తగా పెళ్లయి ఐదు నెలల గడవకముందే అర్ధాంతరంగా అతని జీవితం ముగియడంతో తన భార్య ఉమ కన్నీరు మున్నిరుగా విలపిస్తోంది.
Also Read:మీ ఇంట్లో ఈ మొక్కలను అస్సలు పెంచకండి.. మీకు నష్టం పక్కా !