Home » ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? టాప్ హీరోలంద‌రితో న‌టించింది..!

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? టాప్ హీరోలంద‌రితో న‌టించింది..!

by Anji
Ad

హీరోయిన్ల ఫొటోలు నిత్యం నెట్టింట వైర‌ల్ అవుతుంటాయి. ఇప్పుడు ఇంకా ఇంట‌ర్నెట్ ట్రెండ్ ఎక్కువ‌గా పెరగ‌డంతో ఫ్యాన్ పేస‌జ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ త‌రుణంలో హీరోయిన్స్ చిన్ననాటి ఫొటోలు బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఓ చిన్నారి ఫొటో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ చిన్నారి గ‌త 20 ఏండ్లుగా సౌత్ ఇండ‌స్ట్రీలో టాప్ స్టార్‌గా రాణిస్తున్న‌ది. అందం, అభిన‌యంతో పాటు ఎంత మంది ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీల‌లో దాదాపు స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌న న‌టించింది. తెలుగులో ఒక‌ప్పుడు స్టార్ హీరోల సినిమాకు హీరోయిన్ అంటే ముందు ఈమె పేరునే స‌జిస్ట్ చేసేవారు. ఇంకా ఈ అమ్ముడు ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌నే లేదా.. అయితే మేమే చెబుతాం వినండి.

Advertisement

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో నటించింది.. ఎవరో గుర్తించారా..?ఇక్క‌డ క‌నిపిస్తున్న పాపాయి చెన్నై చంద్రం త్రిష‌కృష్ణ‌న్‌. 1983 మే04 మ‌ద్రాస్‌లో పుట్టింది. 1999 నుంఇ సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తుంది. 2003లో వ‌చ్చిన నీ మ‌న‌సు నాకు తెలుసు మూవీతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. వ‌ర్షం సినిమాతో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న‌ది. ప్ర‌భాస్ హీరోగా త్రిష క‌థానాయిక‌గా న‌టించిన వ‌ర్షం సినిమా సూప‌ర్ హిట్ అయింది. ముఖ్యంగా త్రిష చాలా మందికి వ‌ర్షం సినిమాతోనే ప‌రిచ‌యం.

Advertisement

చిరంజీవి, వెంక‌టేష్‌,బాల‌కృష్ణ‌, నాగార్జున‌, త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నికాంత్ ఇలా అంద‌రితో రొమాన్స్ చేసి రెండు త‌రాల హీరోయిన్‌గా స‌త్తా చాటింది. తెలుగు, త‌మిళంతో పాటు ఉత్త‌రాది రాష్ట్రాల‌లో కూడా అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు అవ‌కాశం ద‌క్కించుకుంది. 96 సినిమాతో చాలా గ్యాప్ త‌రువాత భారీ విజ‌యాన్నే అందుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ కేవ‌లం త‌మిళంలో మాత్ర‌మే సినిమాలు చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య సినిమాలో ఛాన్స్ వ‌చ్చినా వ‌దులుకుంద‌ట ఈ అమ్ముడు. ప్ర‌స్తుతం త్రిష న‌టించిన 4 త‌మిళ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయ‌ట‌.

Visitors Are Also Reading