Home » మీరే నిజమైన హీరో.. మీ ఊరికి వస్తా.. మహేశ్ బాబు ట్వీట్

మీరే నిజమైన హీరో.. మీ ఊరికి వస్తా.. మహేశ్ బాబు ట్వీట్

by Sravan Sunku
Published: Last Updated on

శ్రీ‌మంతుడు సినిమా స్పూర్తితో నిర్మించిన బీబీపేట పాఠ‌శాల‌ను క‌ళాశాల‌గా ఏర్పాటు చేస్తామ‌ని తెలంగాణ పుర‌పాల‌క‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిన్న ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. టాలీవుడ్ హీరో మ‌హేశ్‌బాబు సినిమా శ్రీ‌మంతుడు ఇలాంటి గొప్ప కార్య‌క్ర‌మాల‌కు ఆద‌ర్శంగా నిల‌వ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం అని మంత్రి కేటీఆర్ తో పాటు ప‌లువురు పేర్కొంటున్నారు. ప‌లువురు ఈ సినిమాను ఆద‌ర్శంగా తీసుకొని కొన్ని గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుంటున్నారు.

Also Read: కోట‌లో పెళ్ళికి క‌త్రినా రెడీ

 

ఊరు మనకి చాలా ఇచ్చిన‌ది, తిరిగి మ‌నం ఇవ్వకపోతే చాలా లావు అయిపోతామ‌నే డైలాగ్ చాలామంది మనసుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా స్ఫూర్తితో కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి రూ.12 కోట్లతో ప్రభుత్వ పాఠశాలను కళాశాల‌గా మార్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే హీరో మహేశ్‌బాబు స్పందించారు. ఈ స్కూల్ నిర్మించడానికి కారణం శ్రీమంతుడు సినిమా అని తెలిసి ఎంతో సంతోషం అనిపించిదని చెప్పారు. సుభాష్‌రెడ్డి ప్రస్తుతం నిర్మిస్తున్న జూనియర్ కాలేజ్‌ నిర్మాణం పూర్తయ్యాక శ్రీమంతుడు టీమ్‌తో క‌లిసి క‌చ్చితంగా ఆ క‌ళాశాల‌ను ద‌ర్శిస్తాన‌ని వెల్ల‌డించారు మ‌హేశ్‌బాబు.

Also Read: సింగర్ శ్రీరామ్ పై కుట్ర జరుగుతోందా…ఆ స్క్రీన్ షాట్ లను కావాలనే వైరల్ చేస్తున్నారా…?

Visitors Are Also Reading