Home » సింగర్ శ్రీరామ్ పై కుట్ర జరుగుతోందా…ఆ స్క్రీన్ షాట్ లను కావాలనే వైరల్ చేస్తున్నారా…?

సింగర్ శ్రీరామ్ పై కుట్ర జరుగుతోందా…ఆ స్క్రీన్ షాట్ లను కావాలనే వైరల్ చేస్తున్నారా…?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. శ్రీరెడ్డి చెప్పుకోదగ్గ సినిమాలు చేయకపోయినా క్యాస్టింగ్ కౌచ్ తో ఇండస్ట్రీలో రచ్చ రచ్చ చేసింది. ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు దుస్తులు తీసేసి నిరసనకు దిగింది. దాంతో దేశవ్యాప్తంగా శ్రీరెడ్డి పేరు మారుమోగిపోయింది. అంతేకాకుండా కొంత కాలం పాటు శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం నడిపింది. మోసపోయిన బాధితులకు అండగా ఉంటానంటూ ఇండస్ట్రీలో రచ్చరచ్చ చేసింది. కొంత మంది ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు తనను వాడుకున్నారు అంటూ ఆరోపణలు చేసింది.

Advertisement

ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీ రామచంద్ర తనతో చాట్ చేశాడు అంటూ కొన్ని వాట్సాప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్ లను కూడా భయట పెట్టింది. అయితే శ్రీరెడ్డి భయట పెట్టిన చాలా కాలం తరవాత మళ్లీ ఇప్పుడు ఆ వాట్సాప్ చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం సింగర్ శ్రీరామ్ బిగ్ బాస్-5 లో ఉన్న సంగతి తెలిసిందే. కాస్త పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ్ కొనసాగుతున్నారు. తన యాటిట్యూడ్ తో ఎంతో ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ను కూడా శ్రీరామ్ సంపాదించుకున్నారు. అతడు ఫైనల్ కు వెళ్ళడం కాయం అని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

అయితే ఇలాంటి సమయం లో శ్రీరెడ్డి బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. శ్రీరామ్ అంటే గిట్టని, ఇంటి నుంచి బయటకు వెళ్ళిన సభ్యులు ఎవరైనా కావాలని మళ్ళీ స్క్రీన్ షాట్ లను వైరల్ చేస్తున్నారా…. లేదంటే ఇతర కంటెస్టెంట్ ల అభిమానులు శ్రీరామ్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.

ఏది ఏమైనా ఇలాంటి సమయం లో నెగిటివ్ ప్రచారం జరిగితే శ్రీరామ్ కు మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ నెగిటివ్ ప్రచారం పై బయటకు వచ్చిన తరవాత శ్రీరామ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:పునీత్ తండ్రిని కిడ్నాప్ చేసిన వీర‌ప్ప‌న్..ఇద్ద‌రు సీఎంల‌కు చెమ‌టలు ప‌ట్టించిన ఘ‌ట‌న‌..!

Visitors Are Also Reading