Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » కోట‌లో పెళ్ళికి క‌త్రినా రెడీ

కోట‌లో పెళ్ళికి క‌త్రినా రెడీ

by Sravan Sunku
Ads

కోట‌లో పెళ్ళికి క‌త్రినా రెడీ..బాలీవుడ్ క్వీన్ క‌త్రినాకైఫ్‌, న‌టుడు విక్కీకౌశ‌ల్ త్వ‌ర‌లో ఏడ‌డుగులు వేయ‌బోతున్నారంటూ చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నా విష‌యం తెలిసందే. ఇక వీరి వివామం డిసెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నుంద‌ని బీటౌన్ అభిమానులు గుస‌గుస‌లాడుతున్నారు. ఈ క్ర‌మంలో విక్కీ-కత్రినాలకు దీపావళి రోజున రోకా ఫంక్షన్‌ జరిగినట్లు సమాచారం. అయితే కత్రినాకు ఆప్తుడైన దర్శకుడు కబీర్‌ఖాన్‌ నివాసంలో ఈ వేడుక నిర్వహించారట.

Advertisement

Also Read: వ్యాపారం వ్యాప‌రమే త‌మ్ముడు త‌మ్ముడే… సురేష్ బాబు- వెంక‌టేష్!!

Ad

katrina kaif marriage

katrina kaif marriage

కత్రినా, కౌశల్ ఇరువురి కుటుంబ స‌భ్యులు ఈ వేడుకలో పాల్గొని.. వివాహానికి సంబంధించిన విశేషాల అన్నీమాట్లాడుకున్నారు. విక్కీ-కత్రినా కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. కత్రినా అంటే తనకెంతో ఇష్టమని ఇబ‌ప్పటికే పలు సందర్భాల్లో విక్కీ బయటపెట్టారు. మరోవైపు కత్రినా సైతం విక్కీపై అమితమైన అభిమానాన్ని కనబరిచారు. విక్కీ నటించిన సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి వివాహం జ‌ర‌ప‌డానికి చాలా ఈవెంట్ కంపెనీలు పోటీప‌డుతున్నాయి. డిసెంబ‌ర్ 7-12 మ‌ధ్య జ‌రిగే ఈ వేడుక‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

katrina kaif

katrina kaif

ఈ వివాహ వేడుక‌ను అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌డానికి విక్కీకౌశ‌ల్ చాలా అత్యుత్సాహంగా క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికే రాజ‌స్థాన్‌లోని బ‌వారా కోట‌లో జ‌రుగుతున్న ఈ వివాహ వేడుక‌కు విక్కీ కౌశ‌ల్‌కి సంబంధించిన 10 మంది టీమ్ అక్క‌డికి చేరుకుని అక్క‌డి ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. పెళ్ళి కొడుకు కూర్చోవ‌ల‌సిన ప్లేస్‌, అలాగే పెళ్ళికొడుకు గుర్రం మీద రావ‌డం ఇలాంటి విష‌యాల పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు.

Advertisement

Also Read: శృతి హాస‌న్ కు అనుకున్నంత గుర్తింపు రాలేదా? 12 ఏళ్ల ఆమె కెరీర్ ను ఒక‌సారి ప‌రిశీలిస్తే!

Visitors Are Also Reading