Home » టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలు ఇవే ..! టాప్ 5 లో ఉన్నవి ఇవే ..!

టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలు ఇవే ..! టాప్ 5 లో ఉన్నవి ఇవే ..!

by AJAY
Ad

ఒకప్పుడు సినిమా కలెక్షన్లను, సినిమా ఆడిన రోజులను రికార్డులుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు సినిమా ఆడిన‌ రోజులు.. సినిమా కలెక్షన్ల తో పాటు యూట్యూబ్ లో ట్రైలర్లకు టీజ‌ర్లకు వచ్చిన వ్యూవ్స్ ను కూడా రికార్డులుగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు తమ ఫేవరెట్ హీరో సినిమా ట్రైల‌ర్ ల‌కు వచ్చిన వ్యూవ్స్ చూసి మురిసిపోతున్నారు.

Advertisement

అయితే ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్ ల‌లో కొన్ని సినిమా ట్రైలర్లు యూట్యూబ్ ను షేక్ చేశాయి. అలా అత్య‌ధికంగా వ్యూవ్స్ తో యూట్యూబ్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ట్రైల‌ర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

 

ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు సినిమా రేంజ్ ను ఈ సినిమా ఎక్క‌డికో తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా బాహుబ‌లి పార్ట్ 2 కు 24గంట‌ల్లో 21.81 మిలియ‌న్ వ్యూవ్స్ వచ్చాయి. దాంతో అత్య‌ధిక వ్యూవ్స్ వ‌చ్చిన ట్రైల‌ర్ గా మొద‌టిస్థానంలో నిలిచింది.

Advertisement

రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ హీరోలుగా తెర‌కెక్కిన మ‌ల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కు 24గంట‌ల్లో 20.45 మిలియ‌న్ వ్యూవ్స్ వ‌చ్చాయి. దాంతో అత్య‌ధిక వ్యూవ్స్ వచ్చిన రెండో ట్రైల‌ర్ గా నిలిచింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమా ట్రైల‌ర్ కు 18మిలియ‌న్ల వ్యూవ్స్ వ‌చ్చాయి. దాంతో మూడో అత్య‌ధిక వ్యూవ్స్ వ‌చ్చిన ట్రైల‌ర్ గా నిలిచింది.

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప ట్రైల‌ర్ రీసెంట్ గా విడుద‌ల కాగా 24గంటల్లో 15.1 మిలియ‌న్ల వ్యూవ్స్ వ‌చ్చాయి. దాంతో అత్య‌ధిక వ్యూవ్స్ వ‌చ్చిన నాలుగో ట్రైల‌ర్ గా నిలిచింది.

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన సాహో సినిమా ట్రైల‌ర్ కు 24గంట‌ల్లో 12.33 మిలియ‌న్ వ్యూవ్స్ వ‌చ్చాయి. దాంతో అత్య‌ధిక వ్యూవ్స్ వ‌చ్చిన ఐదో ట్రైల‌ర్ గా నిలిచింది.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’‌ ట్రైలర్ పై సమంత ట్వీట్..ఫైర్.. ఫైర్.. ఫైర్

Visitors Are Also Reading