Home » రీసెంట్గా టాలీవుడ్ హీరోలకు భారీ షాక్ ఇచ్చిన తమిళ దర్శకులు వీరే..!

రీసెంట్గా టాలీవుడ్ హీరోలకు భారీ షాక్ ఇచ్చిన తమిళ దర్శకులు వీరే..!

by AJAY
Ad

ఇప్పటివరకు ఎంతోమంది టాలీవుడ్ హీరోలు తమిళ దర్శకుల దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లో హీరోగా నటించారు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించగా… కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశపరచాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలు ఎక్కువ శాతం తమిళ దర్శకుల సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. కాకపోతే రీసెంట్గా టాలీవుడ్ హీరోలు… కోలీవుడ్ డైరెక్టర్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

Advertisement

కొంతకాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ క్రేజీ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్పైడర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ అద్భుతమైన విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో తమిళ దర్శకుడు అయినటువంటి ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నోట మూవీ చేశాడు.

Advertisement

ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. కొంతకాలం క్రితమే రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రూపొందినటువంటి ది వారియర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాలను నడప విడుదల ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది. టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తమిళ క్రేజీ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో రూపొందిన కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం మే 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీకి భారీ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇలా ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలు… తమిళ దర్శకుల కాంబినేషన్లో వచ్చిన క్రేజీ మూవీలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి.

Visitors Are Also Reading