Home » టాలీవుడ్ స్టార్స్ కుమార్తెలను ఎప్పుడైనా చూశారా..? వాళ్లు ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారంటే..!

టాలీవుడ్ స్టార్స్ కుమార్తెలను ఎప్పుడైనా చూశారా..? వాళ్లు ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారంటే..!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ లుగా రాణించిన వారి సంతానంలో కొడుకులు కూతుళ్లు వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమాలపై ఆసక్తిలేక‌పోవ‌డం వ‌ల్ల‌నో ఇతర కారణాల వలనో పూర్తిగా దూరంగా ఉంటారు.

Advertisement

ముఖ్యంగా హీరోల కుమార్తెలు సినిమాలకు ఎక్కువగా దూరంగా ఉంటారు. కాబట్టి మన టాలీవుడ్ హీరోల కుమార్తెలు ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో కృష్ణంరాజు మూడో కుమార్తె పేరు సాయి ప్రదీప్తి. ప్రస్తుతం సాయి ప్రదీప్తి ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. కృష్ణంరాజు రెండో కుమార్తె పేరు ప్రకీర్తి. ఆమె కూడా ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కృష్ణంరాజు మరో కుమార్తె పేరు సాయి ప్రసీద. ముగ్గురిలో సాయి ప్రసీద పెద్దవారు…. సాయి ప్రసీద చదువు పూర్తి చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Also Read: కార్తికేయ సినిమా కోసం చూస్తున్న ప్రేక్షకులకి మళ్ళీ నిరాశే

ఒకప్పుడు హీరోగా రానించి ప్రస్తుతం విలన్ పాత్రలు చేస్తున్న జగపతిబాబుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒక కుమార్తె ఇప్పటికే పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఇక జగపతిబాబు రెండో కుమార్తె పేరు మేఘన. ప్రస్తుతం మేఘన పిజీ చదువుతోంది.

Advertisement

దగ్గుబాటి వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. వెంకటేష్ మూడో కుమార్తె పేరు భావన దగ్గుబాటి. ప్రస్తుతం ఈమె కూడా ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. ఇక వెంకటేష్ రెండో కూతురు పేరు హయవాహిని దగ్గుబాటి. ప్రస్తుతం హ‌య‌వాహిని కూడా చదువుకుంటోంది.

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ కుమారుడు ఇప్పటికే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్ననాటి పాత్రలో కనిపించాడు. కానీ రవితేజ కుమార్తె గురించి ఎవరికి తెలియదు. రవితేజ కుమార్తె మోక్షదా భూపతి రాజు. ప్రస్తుతం లండన్ లో డిగ్రీ చదువుతోంది.

హీరో శ్రీకాంత్ ఓవైపు హీరో పాత్రలు చేస్తూ మరోవైపు విలన్ గాను నటిస్తున్నారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇప్పటికే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కాక రీసెంట్ గా శ్రీకాంత్ కూతురు మేధా శ్రీకాంత్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మేదా శ్రీకాంత్ డిగ్రీ చదువుతోంది. ఆమెకు సినిమాలపై ఆసక్తి లేదని తెలుస్తోంది.

Also read : హిట్లర్ సినిమా LB శ్రీరామ్ కెరీర్ ని ఎలా నాశనం చేసిందో తెలుసా ? ఆ సినిమా వలన ఆయనకు జరిగిన నష్టం అదే …!

Visitors Are Also Reading