Home » కార్తికేయ సినిమా కోసం చూస్తున్న ప్రేక్షకులకి మళ్ళీ నిరాశే

కార్తికేయ సినిమా కోసం చూస్తున్న ప్రేక్షకులకి మళ్ళీ నిరాశే

by Anji
Ad

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా న‌టిస్తున్న కార్తికేయ‌- 2. ఇక 2014లో వ‌చ్చిన కార్తికేయ సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయిన విష‌యం విధిత‌మే. అప్ప‌ట్లో రూ.6కోట్ల‌తో తెరకెక్కించిన కార్తికేయ సినిమా రూ.20కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. నిఖిల్ కెరీర్‌లో కార్తికేయ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దానికి సీక్వెల్‌గా కార్తికేయ-2ను ద‌ర్శ‌కుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ల్లు బ్యూటి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. స‌త్య శ్రీ‌నివాస్‌రెడ్డి ఇత‌ర ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అనుప‌మా ఖేర్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌కు గురి చేసింది. చిత్ర యూనిట్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నారు. కార్తికేయ‌-2 టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెంచింది. ఇక ఈ సినిమా టీజ‌ర్ చూసి బిజినెస్ బ‌జ్ పెరిగింద‌ని తెలుస్తోంది. కార్తికేయ‌-2 సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ దాదాపు 14కోట్ల వ‌ర‌కు బిజినెస్ జ‌రిగినట్టు స‌మాచారం. నిఖిల్ కెరీర్‌లో ఈ సినిమా బిజినెస్ ఎక్కువ‌గా చేసిన‌ట్టు తెలుస్తోంది. నిఖిల్ అండ్ టీమ్ మాత్రం సినిమా విడుద‌ల పై గ‌ట్టి న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇప్ప‌టికే బ‌య‌టికి వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ మూవీపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసాయి. ఈ త‌రుణంలో కార్తికేయ‌-2 క‌ళ్లు చెదిరే రీతిలో థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రుగుతుంద‌ట‌. ఈ సినిమాకు థియేట్రిక‌ల్ రైట్స్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రూ.14కోట్ల నుంచి 20 కోట్ల వ‌ర‌కు అమ్ముతున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే స‌ముద్రం దాచుకున్న ద్వార‌కాన‌గ‌రం దాని వెను ఉన్న ర‌హ‌స్యాన్ని క‌నిపెట్టే క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌వానికి ఇదే క‌థాంశంతో గ‌తంలో వెంక‌టేష్ దేవిపుత్ర‌డు సినిమా వ‌చ్చిన విష‌యం విధిత‌మే. చైల్డ్ సెంటిమెంట్‌తో సోషియో పాంట‌సిగా తెర‌కెక్కించిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అదేక‌థాంశంతో థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుండ‌డం విశేషం. ప్ర‌పంచ వ్యాప్తంగా జులై 22న థియేటర్స్‌లో విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు అధికారికంగానే ప్ర‌క‌టించారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాను వాయిదా వేస్తున్న‌ట్టు స‌మాచారం. ఆగ‌స్టులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ వార్త‌లో వాస్త‌వం ఏమిటో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.

Also Read : 

హీరో మాధ‌వ‌న్ గురించి ర‌జ‌నీకాంత్ ఏమ‌న్నారంటే..?

సింధు డ్యాన్స్ అదుర్స్‌.. మీకు సంతోషాన్నిచ్చేది చేయాల‌ని పోస్ట్‌..!

 

Visitors Are Also Reading