Telugu News » Blog » హిట్లర్ సినిమా LB శ్రీరామ్ కెరీర్ ని ఎలా నాశనం చేసిందో తెలుసా ? ఆ సినిమా వలన ఆయనకు జరిగిన నష్టం అదే …!

హిట్లర్ సినిమా LB శ్రీరామ్ కెరీర్ ని ఎలా నాశనం చేసిందో తెలుసా ? ఆ సినిమా వలన ఆయనకు జరిగిన నష్టం అదే …!

by AJAY

టాలీవుడ్ లోని విల‌క్ష‌ణ న‌టుల‌లో ఎల్ బి శ్రీరామ్ కూడా ఒక‌రు. సినిమాల పై ఉన్న ఆస‌క్తితో ఎల్బీ శ్రీరామ్ మొద‌ట నాట‌క‌రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర‌వాత ఆల్ ఇండియా రేడియోలో సైతం ప‌నిచేశారు. ఆ త‌ర‌వాత ఆయ‌న సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో త‌న టాలెంట్ ను నిరూపించుకోవ‌డంతో ప్ర‌ముఖ‌నటుడిగా ఎదిగారు. ఎల్ బి శ్రీరామ్ కేవ‌లం న‌టుడిగానే కాకుండా ర‌చయిత‌గా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Ads

అంతే కాకుండా ద‌ర్శ‌కుడిగా కూడా ఆయ‌న ప‌నిచేశారు. ఎల్ బి శ్రీరామ్ రాసిన గ‌జేంద్ర‌మోక్షం నాటిక వేల సార్లు ప్ర‌ద‌ర్శించ‌బ‌డింది. ఎల్ బి శ్రీరామ్ కిష్కింద కాండ సినిమాకు రచయిత‌గా ప‌నిచేయ‌గా ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర‌వాత అతిధి పాత్ర‌లు వేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. మ‌రోవైపు ఆయ‌న హ‌లో బ్ర‌ద‌ర్, హిట్ల‌ర్ లాంటి చిత్రాల‌కు మాట‌ల ర‌చయిత‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Ads

ఎల్ బి శ్రీరామ్ డైలాగులు రాసిన ఎన్నో సినిమాలు సూప‌ర్ హిట్ గా నిలిచాయి. అన్ని ర‌కాల పాత్ర‌లు చేసిన‌ప్ప‌టికీ క‌మెడియ‌న్ గా మ‌రియు ఎమోష‌నల్ సీన్స్ లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఎల్ బి శ్రీరామ్ మాట‌లు రాసిన హిట్ల‌ర్ సినిమా భారీ విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ ఆ సినిమా ఆయ‌న‌కు శాపంగా మారింద‌ట‌. హిట్ల‌ర్ సినిమా త‌ర‌వాత త‌న‌కు చాలా అవకాశాలు వస్తాయ‌ని ఎల్ బి శ్రీరామ్ భావించార‌ట‌.

కానీ ఆ సినిమాలో చిరంజీవికి తక్కువ డైలాగులు ఉండ‌టంతో ఈ సినిమా త‌ర‌వాత ర‌చ‌యిత‌గా ఎల్ బి శ్రీరామ్ కు ఎలాంటి గుర్తింపు రాలేదట‌. ఆ త‌ర‌వ‌త ర‌చ‌యిత‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డం వ‌ల్లే తాను న‌టుడిగా స్థిర‌పడిపోయిన‌ట్టు ఎల్ బి శ్రీరామ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అదే విధంగా మిథునం సినిమాలో న‌టించాల‌ని మొద‌ట త‌న‌కు ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఈ సినిమాకు త‌నికెళ్ల‌భ‌ర‌ణి ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కానీ ఈ సినిమాలో ఎల్ బి శ్రీరామ్ స్థానంలో చివ‌రికి ఎస్ పి బాల‌సుబ్ర‌మ‌ణ్యం ను తీస‌కున్నారు.

also read : చిరంజీవి చెల్లెలిగా నటించిన సంయుక్త మీకు గుర్తుందా.. ఆమె భర్త ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు..!