Home » 2024 లో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్‌ హీరోయిన్లు…!

2024 లో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్‌ హీరోయిన్లు…!

by Bunty
Ad

 

2023 సంవత్సరంలో చాలామంది బ్యాచిలర్స్ వివాహబంధంలోకి అడుగు పెట్టారు. 2023 సంవత్సరం చాలామంది సెలబ్రిటీలకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే తాజాగా 2024 సంవత్సరంలో కొంతమంది హీరోయిన్లు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారట. కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటున్న ఈ హీరోయిన్లు 2024 సంవత్సరంలో ఎలాగైనా వివాహ బంధంతో ఒకటవ్వాలని ఫిక్స్ అయిపోయారట. కొంతమంది హీరోయిన్లు సినిమాల పరంగా కలిసి రాక వివాహం చేసుకోవాలని అనుకుంటే, మరికొందరేమో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకోవాలని మరికొందరు హీరోయిన్లు అనుకుంటున్నారట. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో 2024 సంవత్సరంలో వివాహం చేసుకుంటున్నా హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Tollywood heroines who are going to get married in 2024

Tollywood heroines who are going to get married in 2024

# రకుల్ ప్రీత్ సింగ్

Advertisement

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ 2024 లో వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయిందట. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయినటువంటి జాకీ భగ్నానితో ఎంతోకాలంగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతుందట. వివాహానికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం.

# తమన్నా

గత కొద్ది కాలంగా తన ప్రియుడు విజయవర్మతో డేటింగ్ లో ఉన్నటువంటి తమన్నా ఈ సంవత్సరం వివాహం చేసుకోబోతోంది. ఇప్పటికే సినిమాల పరంగా కాస్త స్లో అయిన తమన్నా పర్సనల్ లైఫ్ లో మీద ఫోకస్ చేస్తుందట.

# అదితి రావు హైదరి

అదితి రావు, సిద్ధార్థ్ గత కొద్దికాలం నుంచి డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించినప్పటికీ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి లివింగ్ రిలేషన్ లో ఉంటున్న వీరిద్దరూ ఈ సంవత్సరం వివాహం చేసుకోబోతున్నారు.

# సంయుక్త మీనన్

ఈ బ్యూటీ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ప్రస్తుతం సంయుక్త ఎలాంటి సినిమాలకు ఓకే చెప్పకపోవడంతో తాను వివాహం చేసుకోబోతుందంటూ, అందుకే సినిమాలకు కాస్త దూరంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టి సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading