Telugu News » Blog » సినీ న‌టి సౌంద‌ర్య ల‌వ్ స్టోరీ గురించి తెలుసా..?

సినీ న‌టి సౌంద‌ర్య ల‌వ్ స్టోరీ గురించి తెలుసా..?

by Anji
Ads

సౌంద‌ర్య అప్ప‌ట్లో ఎంతో క్రేజ్ ఉన్న సినీ న‌టి. తెలుగు, క‌న్న‌డం, మ‌ల‌యాళం, త‌మిళం వంటి భాష‌ల్లో వందలాది సినిమాల్లో న‌టించారు. సౌంద‌ర్య అస‌లు పేరు సౌమ్య. సిని రంగం ప్ర‌వేశం కొర‌కు ఆమె పేరును సౌంద‌ర్య‌గా మార్చుకుంది. ఆమె ఎంబీబీఎస్ మొద‌టి సంవత్స‌రంలో ఉండ‌గా.. ఆమె తండ్రి స్నేహితుడు ఒక‌త‌ను 1992లో గంధ‌ర్వ చిత్రంలో న‌టించేందుకు అవ‌కాశం ఇచ్చారు.  ఇక‌ అమ్మోరు చిత్రం విజ‌య‌వంతం అయిన త‌రువాత ఆమె చ‌దువును మ‌ధ్య‌లోనే ఆపివేసింది.

Advertisement

Gandharva || Kannada Full Movie || Shashikumar, Brinda, Soundarya || Full  HD - YouTube

ఆ త‌రువాత ఆమె తెలుగు చిత్ర రంగం ప్ర‌వేశం చేసింది. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఆమె మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు గ‌డించి ఇక్క‌డ ఆమె విజ‌య ఢంక మోగించింది. ఆమె క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ళ‌యాళం మ‌రియు, హిందీలో కూడ న‌టించింది. ముఖ్యంగా హిందీలో అమితాబ‌చ్చ‌న్‌తో క‌లిసి సూర్య‌వంశ్ అనే హిందీ చిత్రంలో న‌టించింది. సినీ రంగంలో ఎఫైర్స్ ఉండ‌టం స‌ర్వ‌సాధార‌ణం. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గొప్ప పేరు తెచ్చుకున్న సౌంద‌ర్య‌కు అప్ప‌ట్లో చాలా ఎఫైర్స్ ఉన్నాయ‌ని.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గుస‌గుస‌లు వినిపించాయి.

Did you know Amitabh Bachchan's 'Sooryavansham' co-star Soundarya was  pregnant and wanted to quit films before she passed away? | Hindi Movie  News - Times of India

అప్ప‌ట్లో సౌంద‌ర్య కెరీర్ హిట్ సినిమాల‌తో దూసుకుపోతున్న త‌రుణంలో సౌంద‌ర్య విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు.. వెంక‌టేష్‌, సౌంద‌ర్య న‌టించిన రాజా, పెళ్లి చేసుకుందాం, జ‌యం మ‌న‌దేరా ఇలా ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన ప్ర‌తీ సినిమా హిట్ అయింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉన్న‌ద‌ని అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి.

Advertisement

21 Years for Raja: 5 reasons why the film was a sensational hit at the box  office | The Times of India

డి.రామానాయుడు కొడుకు అనో ఏమో తెలియ‌దు కానీ, ఈ విష‌యం ఎక్కువ‌గా బ‌య‌ట‌కు రాలేదు. ఆ త‌రువాత సౌంద‌ర్య జ‌గ‌ప‌తిబాబుతో ఎక్కువ సినిమాలు చేసింది. ఆ త‌రుణంలో సౌంద‌ర్య‌కు, జ‌గ‌ప‌తిబాబుకు మ‌ధ్య ఎఫైర్ న‌డించిందని సినీ ప‌రిశ్ర‌మ కోడై కూసింది. అప్పుడు దీనిని ఎవ్వ‌రూ ఖండించ‌క‌పోవ‌డంతో ఇది నిజ‌మేన‌ని అనుకున్నారు అంద‌రూ. ఏప్రిల్ 17, 2004లో సౌంద‌ర్య విమాన ప్ర‌మాదంలో మృతి చెందిన స‌మ‌యంలో జ‌గ‌ప‌తి బాబు కంట‌త‌డి పెట్టుకున్నాడనే వార్త‌లు కూడా వినిపించాయి. సౌంద‌ర్య చ‌నిపోయింద‌నే ఆలోచ‌న నుంచి కోలుకోవ‌డానికి జ‌గ‌ప‌తిబాబుకు చాలా స‌మ‌యం ప‌ట్టింద‌ట‌. అందుకే ఆ స‌మ‌యంలో సినిమాల‌కు కొద్ది రోజులు దూరంగా ఉన్నాడ‌ట‌.

Advertisement

Jagapathi Babu Tollywood Senior Hero Soundarya Love Affair About With -  Telugu Jagapathibabu Tollywood-Telugu Tren-TeluguStop

ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీకి మ‌ద్ద‌తుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రసంగించ‌డానికి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో విమాన ప్ర‌మాదం సంభ‌వించింది. ఆమె అన్న క‌న్న‌డ చిత్రాల నిర్మాత అయిన అమ‌ర్‌నాథ్ కూడా ఆ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆమె క‌న్న‌డంలో న‌టించిన ఆక‌రి ఆప్తామిత్ర విజ‌య‌వంతం అయింది. ప్ర‌స్తుతం ఆమె జ్ఞాప‌కార్థం సౌంద‌ర్య స్మార‌క పుర‌స్కారంను క‌ర్నాట‌క ఆంధ్ర, ల‌లిత క‌ళా అకాడ‌మి వారు ప్ర‌తీ సంవ‌త్స‌రం ఉగాది పండుగ రోజున ఉత్త‌మ న‌టీమ‌నుల‌కు బ‌హుమ‌తులు అంద‌జేస్తారు. కేవలం క‌న్న‌డ‌మే కాకుండా ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో సౌంద‌ర్య‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.