Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Published: Last Updated on
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 19.11.2022: మేషం

అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మన:పీడ ఉంది. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలి.

Today rashi phalau in telugu: మిథునం

పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోకుండా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఓ వార్త మనశ్శాంతిని తగ్గిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించిన పనుల్లో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను వింటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. ప్రారంభించిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : తుల

లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరమవుతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పని చేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉద్యోగ, వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.  ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది.  ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

మీమీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలకమైన విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కీలక విషయాలను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకుంటే మంచిది. కలహ సూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడుతారు. అదృష్టం వరిస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.

Visitors Are Also Reading