Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 04.11.2022: మేషం

ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో విబేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu: వృషభం 

తోటివారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

మిశ్రమ ఫలితాలున్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి. ఒక సంఘటన మీకు కాస్త బాధను కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారంలో  పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలున్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కీలక విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వండి. భవిష్యత్ ను  దృష్టిలో ఉంచుకొని  నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు.  స్థానచలన సూచనలున్నాయి. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో శుభఫలితాలున్నాయి. ధర్మసిద్ధి ఉంది. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పని చేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. భోజన నియమాలను పాటించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కుంభం

కాలం కలిసొస్తుంది. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టమైన ప్రార్థన మరింత మేలు చేస్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది.

Visitors Are Also Reading