Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వారితో జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వారితో జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 19.07.2022: మేషం

 

శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితాలున్నాయి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ప‌రిచ‌యం లేని వారి మాట‌లు విన‌కండి. స‌మాజంలో గౌర‌వం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: వృషభం 

ధృడ‌మైన మ‌న‌స్సుతో ముందుకు సాగండి. ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. బంధు ప్రీతి ఉంటుంది. భోజ‌న సౌఖ్యం క‌ల‌దు. మాన‌సిక ఉల్లాసాన్ని పొందుతారు.

Today rashi phalau in telugu: మిథునం

కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది. ఆత్మీయుల స‌ల‌హాలు మేలు చేస్తాయి. మ‌నోవిచారాన్ని క‌లిగించే సంఘ‌ట‌న‌ల‌కు దూరంగా ఉండాలి. శ్ర‌మ పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తే మంచిది.

Today rashi phalau in telugu : కర్కాటకం

అప్ర‌మ‌త్తంగా ఉండాలి. కీల‌క స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి శ‌త్రువుల‌పై విజ‌యం సాధించ‌గ‌లుగుతారు.ఒక వ్య‌వ‌హారంలో అప‌కీర్తి వ‌చ్చే ఆస్కార‌ముంది. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : సింహం

కార్య‌సిద్ధి ఉంది. చిత్త‌శుద్దితో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి ఆనంద‌క‌ర‌మైన కాలాన్ని గ‌డుపుతారు. గో సేవ చేయ‌డం ఉత్త‌మం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మంచి ప‌నులు చేయ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. బుద్ధిబ‌లం బాగుంటుంది. భోజ‌న సౌఖ్య‌ముంది. మిత్రుల‌తో కాలాన్ని గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ ప్ర‌తిభ‌తో పెద్ద‌ల‌ను మెప్పిస్తారు. బంధు, మిత్రుల‌ను క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌గ‌లుగుతారు. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. అన‌వ‌స‌రంగా ఆందోళ‌న ప‌డ‌డం త‌గ్గించుకుంటే మంచిది. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu : ధనస్సు

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌రిగే సూచ‌న‌లున్నాయి. అధికారుల‌తో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌తారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప్రారంభించిన ప‌నుల్లో జాప్యం వ‌ద్దు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ పైవారితో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. వ్యాపారంలో నిపుణుల స‌ల‌హాలు మేలు చేస్తాయి. మ‌న ప‌క్క‌నే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు.

Today rashi phalau in telugu : కుంభం

అనుకూల ఫ‌లితాలున్నాయి. స్థిర‌మైన నిర్ణ‌యాలు మిమ్మ‌ల్ని గొప్ప‌వారిని చేస్తాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోష‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ప్ర‌యాణ సౌఖ్యం ఉంది.

Today rashi phalau in telugu :  మీనం

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల‌త క‌ల‌దు. కుటుంబ స‌హ‌కారం ఉంటుంది. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు అందుతాయి. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం బెట‌ర్.

Visitors Are Also Reading