Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆటంకాలు పెరుగుతాయి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆటంకాలు పెరుగుతాయి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 13.07.2022: మేషం

 

ఈ రాశి వారికి ఆటంకాలు పెరుగుతాయి. కీల‌క విష‌యాల్లో అప్ర‌మ‌త్త‌త చాలా అవ‌స‌రం. ముఖ్యంగా బ‌ద్ధ‌కాన్ని అస‌లు ద‌రిచేర‌నీయ‌కండి. బంధువుల స‌హ‌కారం ఉంటుంది. బంధువుల‌తో గొడ‌వ‌లు జ‌రిగే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu: వృషభం 

ఉత్సాహంగా ప‌ని చేస్తే గొప్ప‌వారు అవుతారు. అజాగ్ర‌త్త వ‌ద్దు. కీల‌క వ్య‌వ‌హారాల్లో తొంద‌ర‌పాటు ప‌నికి రాదు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. అవ‌స‌రానికి మించి ఖ‌ర్చు చేస్తారు. కొన్ని సందర్భాల్లో శ‌త్రువుల‌ను క‌లుపుకొనిపోవ‌డం మంచిది.

Today rashi phalau in telugu: మిథునం

మీ నిబద్ధ‌తే మీ విజ‌యానికి మూలం. అన‌వ‌స‌ర‌మైన విష‌యాల్లో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోన‌వ్వ‌కుండా ప్ర‌శాంత‌మైన ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగితే అంతా మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

ల‌క్ష్య సాధ‌న‌లో తోటివారి స‌హ‌కారం అందుతుంది. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మిస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఆలోచ‌న‌ల్లో స్థిర‌త్వం అవ‌స‌రం.

Today rashi phalau in telugu : సింహం

ఓ శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది. కీల‌క వ్య‌వ‌హారాల్లో అధికారుల ఆశీస్సులు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేప‌ట్టే ప‌నిలో అల‌స‌ట పెరుగుతుంది. మీ పై అధికారుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. విరోధులు దూరంగా ఉండాలి. కుటుంబ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రిస్తారు.

Today rashi phalau in telugu : తుల

మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతారు. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. గొప్ప‌వారితో ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

స‌త్ప‌లితాల‌ను పొందుతారు. చేప‌ట్టిన ప‌నుల్లో విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఒక వ్య‌వ‌హారంలో స‌హాయం అందుతుంది. శారీర‌క శ్ర‌మ కాస్త పెరుగుతుంది. బంధు, మిత్రుల‌తో విబేధాలు రావ‌చ్చు.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకుంటే మేలు జ‌రుగుతుంది. మొహ‌మాటాల‌తో ఖ‌ర్చులు పెరుగుతాయి. కోపాన్ని కాస్త త‌గ్గించుకుంటే మంచిది. పెద్ద‌ల‌తో అణిగిమ‌ణిగి ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప్రారంభించిన ప‌నులు జాప్యం కాకుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు అస్థిర‌బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు. తోటివారి సూచ‌న‌లు ఉప‌క‌రిస్తాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

మ‌నఃసౌఖ్యం క‌ల‌దు. మీ బుద్ధిబ‌లంతో ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. స‌మాజంలో మంచి పేరు సిద్ధిస్తుంది. కుల‌దైవ సంద‌ర్శ‌నం శుభాన్ని చేకూర్చుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

ఆయా రంగాల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. ధ‌ర్మ‌సిద్ధి ఉంది. స్వ‌స్థాన ప్రాప్తి సూచ‌న‌లున్నాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు ఉత్సాహాన్ని పెంచేవిధంగా ఉంటాయి. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Visitors Are Also Reading