Telugu News » Today rasi phalalu in telugu : ఈ రాశి వారికి ఉద్యోగం గ్యారెంటీ

Today rasi phalalu in telugu : ఈ రాశి వారికి ఉద్యోగం గ్యారెంటీ

by Anji

రాశిఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.

Ads

Today rashi phalau in telugu : మేషం

వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడుతారు. లిటిగేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు దూకుడు తగదు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Today rashi phalau in telugu : వృషభం 

బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. సొంతంగా గాని, భాగస్వామ్యంగాగాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో చికాకులు తప్పవు. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కుటుంబీకుల అవసరాలు, కోరికలు నెరవేర్చగల్గుతారు. రుణం తీసుకోవటం, ఇవ్వటం క్షేమం కాదని గమనించండి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొన్ని పనులు సాధిస్తారు. సహోద్యోగులతో వాగ్వాదాలు తగదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఆలస్యమైనా పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాయిదా పడిన మొక్కుబడులు ఎట్టకేలకు తీర్చుకుంటారు. మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.

Today rashi phalau in telugu : సింహం

వ్యాపారంలలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

Today rashi phalau in telugu : క‌న్య

సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ముందస్తు జాగ్రత్తతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాలి. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు.

Today rashi phalau in telugu : తుల

కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో పెద్దల నుండి అభ్యంతరాలను ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మార్కెట్ రంగాల వారికి ఆందోళన వంటివి తలెత్తుతాయి. బంధు మిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. స్త్రీల అతి అలంకరణ విమర్శలకు దారి తీస్తుంది.

 

Today rashi phalau in telugu : వృశ్చికం

వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. పత్రికా సంస్థలలోని వారికిఒక సమాచారం అందోళన కలిగిస్తుంది. భాగస్వామిక సంస్థల్లో మీ పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు. ఇతరుల తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. చీటికి మాటికి ధనం విపరీతంగా వ్యయం చేస్తారు.

Today rashi phalau in telugu : ధనస్సు

స్త్రీల అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. రాజకీయనాయకులు తరుచు సభలు, వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు ఊహించినవే కావటంతో ఇబ్బందులుండవు ప్రేమికుల వ్యవహారం వివాదాస్పద మవుతుంది. విదేశాల నుంచి ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆశాదృక్పథంలో కొత్తయత్నాలు సాగిస్తారు

Today rashi phalau in telugu మకరం

ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. శారీరకశ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సభ్యత్వాలు, పదవులనుంచి తప్పుకోవలసి వస్తుంది.

Today rashi phalau in telugu : కుంభం

స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. విద్యారులు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధవహిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

Today rashi phalau in telugu : మీనం

చేపట్టిన పనులలో ఓర్పు, పట్టుదల అవసరం. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి.


You may also like