రాశి ఫలాలు చదవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ భవిష్యత్లో ఏం జరుగుతుందో మీరు ముందే ఊహించుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Today Rashi phalau in Telugu 29.04.2022: మేషం
కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓ వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరమవుతాయి.
Today rashi phalau in telugu : వృషభం
ఏదైనా పని ప్రారంభించేటప్పుడు చెడు ఆలోచనలు చేయకూడదు. ఓ వార్త మనో ధైర్యాన్ని పెంచుతుంది. సుఖ, సంతోషాలతో గడుపుతారు. చక్కని ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు.
Today rashi phalau in telugu : మిథునం
వ్యాపారం చేయాలనే ఆలోచనలు వస్తుంటాయి. అనవసరమైన ఘర్షణలు పెంచుకోకూడదు. శారీరక, మానసిక విశ్రాంతి అవసరం. కుటుంబంలో ఓ శుభకార్యానికి హాజరవుతారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
అందరినీ కలుపుకుని పోవడం అవసరం. కీలక విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది.
Today rashi phalau in telugu : సింహం
ఆటంకాల వల్ల శ్రమ అధికమవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి.
Today rashi phalau in telugu : కన్య
దైవబలంతో ఓ పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు.
Advertisement
Today rashi phalau in telugu : తుల
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరి చేరనీయకండి.
Today rashi phalau in telugu : ధనస్సు
మీమీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంది. చతుర్థ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి విశ్రాంతి అవసరం.
Today rashi phalau in telugu మకరం
మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి.
Today rashi phalau in telugu : కుంభం
అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. ద్వితీయ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే.. అన్ని సర్దుకుంటాయి.
Today rashi phalau in telugu : మీనం
కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ధర్మ సిద్ధి ఉంది.
ఇవి కూడా చదవండి :
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా..?
అబ్బాయిల్లో అమ్మాయిలు ఇష్టపడే 5లక్షణాలు ఏంటో తెలుసా…!