Telugu News » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారి ప్ర‌వ‌ర్త‌న వారికి బాధ క‌లిగిస్తుంది

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారి ప్ర‌వ‌ర్త‌న వారికి బాధ క‌లిగిస్తుంది

by Anji

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

 

Today Rashi phalau in Telugu 13.04.2022: మేషం

అనుభ‌వ‌జ్ఞులు సూచించిన మార్గంలో ముందుకు సాగండి. మంచి చేకూరుతుంది. ధ‌న‌లాభం క‌లుగుతుంది. సంతోషంగా ఉంటారు.

Today rashi phalau in telugu : వృషభం 

మీ రంగాల్లో మిశ్ర‌మ ఫ‌లితాలుంటాయి. కొన్ని వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రిస్తారు. ప్రారంభించిన ప‌నుల‌ను పూర్తి చేయ‌డంలో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేస్తారు. ఒక‌రి ప్ర‌వ‌ర్త‌న మీకు బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది. మ‌నఃసౌఖ్యం క‌ల‌దు. ఒక శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. కీల‌క వ్య‌వ‌హారాల్లో అధికారుల ఆశీస్సులు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

చేసే ప‌నిలో మ‌నోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే సూచ‌న‌లున్నాయి. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో ఆశించిన కొన్ని ఫ‌లితాల‌ను పొంద‌డానికి బాగా శ్ర‌మించాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

బుద్ధిబ‌లం బాగుంటుంది. కీల‌క భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. కొత్త ఆలోచ‌న‌లు చేసి వాటిని ఆచ‌ర‌ణలో పెడ‌తారు. స‌మాజంలో గౌర‌వాభిమానాలు పెరుగుతాయి. బంధు, మిత్రుల‌ను ఆద‌రిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.

Today rashi phalau in telugu : క‌న్య

మ‌ధ్య‌మ ఫ‌లితాలున్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగితే స‌త్ఫ‌లితాలు సిద్ధిస్తాయి. బంధు, మిత్రుల‌ను క‌లుపుకొని పోవాలి. మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను క‌నుగొంటారు. మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం దైవ చింత‌న అవ‌స‌రం అవుతుంది.

Today rashi phalau in telugu : తుల

కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఒక వ్య‌వ‌హారంలో ఊహించ‌ని ఫ‌లితాలు వ‌స్తాయి. అవి మీకు సంతోషాన్ని క‌లిగిస్తాయి. అధికారుల‌కు మీ ప‌ని తీరు న‌చ్చుతుంది. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఒక శుభ‌వార్త మీ ఇంల్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు. కొన్ని విష‌యాల్లో ఊహించిన దాని క‌న్నా ఎక్కువ ఫ‌లితాలు ఉంటాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.
Today rashi phalau in telugu : ధనస్సు

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదుఎరైనా వాటిని అధిగ‌మిస్తారు. ముఖ్య విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉంటే మంచిది. బంధు, మిత్రుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. అప‌రిచితుల‌తో జాగ్ర‌త్త‌.

Today  rashi phalau in telugu మకరం

తోటివారి స‌హ‌కారంతో ప‌నులు పూర్త‌వుతాయి. ఇబ్బంది పెట్టేవారిని ప‌ట్టించుకోకండి. అన‌వ‌స‌ర క‌ల‌హాల‌తో స‌మ‌యం వృథా చేసుకోకండి. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

స్థిర నిర్ణ‌యాల వ‌ల్ల మంచి జ‌రుగుతుంది. ఆర్థికంగా అనుకూల ఫ‌లితాలున్నాయి. దైవ‌బ‌లం ర‌క్షిస్తోంది. ఓ వ్య‌వ‌హారంలో మీ ప్ర‌తిభ‌కు గుర్తింపు ల‌భిస్తుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు బాధ క‌లిగిస్తాయి. అధికారులు మీకు అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు.

Today rashi phalau in telugu : మీనం

 

మీమీ రంగాల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. ధ‌ర్మ‌సిద్ధి ఉంది. స్వ‌స్థాన ప్రాప్తి సూచ‌లున్నాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు ఉత్సాహాన్ని పెంచేవిధంగా ఉంటాయి. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.


You may also like