Home » Chanakya Niti:భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఇవి పాటించాల్సిందే..!!

Chanakya Niti:భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఇవి పాటించాల్సిందే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆచార్య చాణిక్యుడు అపర మేధావి.. ఆయన మానవ జీవితం గురించి ఎన్నో విషయాలను తన నీతి శాస్త్రం ద్వారా బోధించారు. అలాంటి చాణిక్యుడు తన బోధనల ద్వారా ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చారని చెప్పవచ్చు. ఆయన బోధనలు ఇప్పటికీ చాలామంది ఆచరిస్తున్నారు. అలాంటి ఆచార్య చాణిక్యుడు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే ఏ విధంగా ఉండాలో తెలియజేశారు మరి అవి ఏంటో చూద్దామా..
అహంకారం:

భార్యాభర్తల మధ్య నువ్వు తక్కువ నేను ఎక్కువ అని అహంకారం ఉండకూడదట. అహంకారం వల్ల భార్యాభర్తల బంధం దెబ్బతింటుందని దీనివల్ల చీలికలు వచ్చి, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిపోయి దూరం పెరుగుతుందని ఆచార్య చాణిక్యుడు తెలియజేశారు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే అహం భావాన్ని పక్కన పెట్టాలని సూచించాడు ఆచార్యుడు.

Advertisement

also read:రుద్రుడు సినిమా రివ్వ్యూ…లారెన్స్ కాంచ‌న రేంజ్ హిట్ కొట్టాడా..?

అనుమానం:

Advertisement

దంపతులంటే ఒకరిపై ఒకరికి ప్రేమ,అనురాగం ఉండాలి. అంతేకాకుండా నమ్మకం ఎక్కువగా ఉండాలి. ఈ నమ్మకం ఉన్నచోటే ప్రేమ కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చాణిక్యుడు తెలియజేశారు. నమ్మకం పోవడానికి ఒక్క క్షణకాలం సరిపోతుందని అన్నారు. అనుమానం పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం, ప్రశాంతత కోల్పోతారని ఆచార్యుడు అన్నారు.

also read:సినిమా ఇండస్ట్రీలోనే టాప్ 3 ధనవంతుల్లో నాగార్జున కూడా ఉన్నారా..?

స్వేచ్ఛ :


భార్యాభర్తల సంబంధం లో ఒకరికొకరు స్వేచ్ఛగా జీవించాలి. భార్య భర్త ముందు భర్త భార్య ముందు ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా పంచుకునేలా బంధం ఉండాలి. ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చాలని రూలేమీ లేదు. ఎవరి వ్యక్తిగత విషయమంలోనైనా వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. దంపతులు ఇద్దరైనా ఎవరి జీవితం వారిదే ఎవరి ఇష్టాఇష్టలు వారివే. విలువలు, అభిరుచులు,అలవాట్లు, అభిప్రాయాలు, నమ్మకాలు వేరువేరుగా ఉండవచ్చు. కానీ స్వేచ్ఛ,ప్రేమానురాగాలు ఉండాలి.

also read:

Visitors Are Also Reading