Telugu News » Blog » నిద్రించే టైంలో గురక విపరీతంగా వస్తుందా? అయితే ఇవి తెలుసుకోండి!

నిద్రించే టైంలో గురక విపరీతంగా వస్తుందా? అయితే ఇవి తెలుసుకోండి!

by Bunty
Ads

 

నిద్రపోయే సమయంలో గురక పెట్టే అలవాటు చాలామందిలో ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు గురక పెడితే దానంత నరకం మరొకటి ఉండదు. నిద్రపోయేవారు గురకనుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మేలంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా కొందరు రాత్రుళ్ళు ఒక పెగ్ వేయనిదే నిద్రపోరు. అయితే గురక రావడానికి మద్యం ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

Advertisement

READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !

Advertisement

కాబట్టి నిద్రించే ముందు మధ్యాహ్నం వీలైనంతవరకు దూరంగా ఉండాలి. అలాగే జలుబు చేసినప్పుడు ముక్కు క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల గురక పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే మనం మొదట ముక్కుని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. తద్వారా గురక కంట్రోల్ అవుతుంది. అధిక బరువు కూడా గురకకు ఒక కారణం. అందుకే శరీర బరువును అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి.

READ ALSO : కేసీఆర్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా : DH శ్రీనివాసరావు

Snoring Problems | గురక సమస్య హెల్త్ News in Telugu

తద్వారా గురక సమస్యను సులభంగా నివారించుకోవచ్చు. రాత్రులు నిద్రించే ముందు అర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కు అర టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలాచేస్తే గురకరాకుండా ఉంటుంది. లేదా రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక వెళ్లకిలా పడుకున్నప్పుడు గురక ఎక్కువగా వస్తుంది. అందుకని నిద్రొచ్చే సమయంలో పక్కకు తిరిగి పడుకోవాలి. యోగ, ప్రాణాయామం అలవాటు చేసుకోవడం వల్ల గురక సమస్యను దూరం చేసుకోవచ్చు.

Advertisement

read also : సీనియర్ ఎన్టీఆర్ లాంగ్ డ్రైవింగ్ చేస్తే… కుక్కలు, కోళ్లు అవుట్ అంతే…!