Telugu News » Blog » సీనియర్ ఎన్టీఆర్ లాంగ్ డ్రైవింగ్ చేస్తే… కుక్కలు, కోళ్లు అవుట్ అంతే…!

సీనియర్ ఎన్టీఆర్ లాంగ్ డ్రైవింగ్ చేస్తే… కుక్కలు, కోళ్లు అవుట్ అంతే…!

by Bunty
Published: Last Updated on
Ads

విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, అన్న నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా రంగంలో అయితే ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించారు. ఆయన నటించిన పలు పాత్రలతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక, జానపద, సాంఘికంగా ఇలా అన్ని రకాల సినిమాలతో సీనియర్ ఎన్టీఆర్ ఓ ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూసేవారు. ఇక ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ కూడా చాలా విభిన్నం.

Advertisement

READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !

ఇక కారు డ్రైవింగ్ లో ఎన్టీఆర్ చాలా ఫాస్ట్ గా ఉండేవారు. చండశాసనుడు చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివారు గ్రామమైన దేవరాయాంజాల్ లో ఎక్కువగా జరిగింది. హైదరాబాదు నుంచి ఎన్టీఆర్ తనే కారు డ్రైవ్ చేసుకుంటూ లొకేషన్ కి వెళ్లేవారు. వెనుక సీట్లో అసోసియేట్ డైరెక్టర్ వివి రాజు, హరికృష్ణ కూర్చునే వారు. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ కారుకు బ్రేక్ వేయకపోగా ఇంకా స్పీడ్ గా డ్రైవ్ చేసేవారు. వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు ఎగిరిపడేవారు.

Advertisement

READ ALSO : కేసీఆర్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా : DH శ్రీనివాసరావు

 

వెంటనే ఆయన రివర్స్ వ్యూ మిర్రర్ లోంచి చూస్తూ ఏం రాజుగారు మేం డ్రైవ్ చేస్తుంటే భయంగా ఉందా అని అడిగేవారు. ఎందుకు ఉండదు సార్, అయినా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ వేయకపోతే ఎలా సార్ అనేవారు. దానికి ఎన్టీఆర్ నవ్వేసి మనం అంతేనండి లాంగ్ జర్నీ చేశామంటే రెండు మూడు కుక్కలు, నాలుగైదు కోళ్లు అవుట్ మన దెబ్బకి అని నవ్వే వారట. అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఉదయం 4:45 నిమిషాలకు తన శ్రీమతి బసవతారకంతో మాట్లాడేవారట.

Advertisement

READ ALSO : Virat Kohli : 1205 రోజుల తర్వాత విరాట్ టెస్ట్ సెంచరీ