సూపర్ స్టార్ ఫ్యామిలీకి 2022 అస్సలు మరిచిపోలేని సంవత్సరం అనే చెప్పవచ్చు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఈ ఏడాది లోనే మరణించడం గమనార్హం. ప్రారంభంలోనే జనవరి 08వ తేదీన వారి ఇంట్లో తొలి విషాదం చోటు చేసుకుంది. కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబుకి అన్నయ్య రమేష్ బాబు లివర్ సంబంధిత సమస్యలతో మరణించారు. వయో సంబంధిత వ్యాధితో కృష్ణ భార్య ఇందిరా దేవి సెప్టెంబర్ 28న మరణించారు. ఈవిడ మరణం కృష్ణను మరింత కుంగదీసింది. కృష్ణ కూడా మరణించడంతో ఒకే సంవత్సరం కుటుంబంలో ఉన్న ముగ్గురు పెద్దవాళ్లు దూరమైనట్టు అయింది. బాధ నుంచి కోలుకోవడానికి మహేష్ బాబుకి, ఆయన కుటుంబానికి చాలా కాలమే పడుతుంది.
Advertisement
Also Read : నరసింహనాయుడు సినిమాకు తెరవెనక ఇంత కథ జరిగిందా..? టైటిల్ తో పాటూ కథ మొత్తం ఎందుకు మార్చారంటే..?
1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ-ఇందిరాదేవిలకు మొదటి సంతానంగా రమేష్ బాబు జన్మించారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా పరిచయమయ్యారు.కృష్ణ నటించిన పలు సినిమాల్లో బాల నటుడి పాత్రలను రమేష్ బాబు పోషించారు. వి. మధు సూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన సామ్రాట్ తో రమేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అపజయాలు ఎదురు కావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. 1997లో ఎన్. శంకర్ దర్శకత్వంలో ఎన్ కౌంటర్ సినిమాలో రమేష్ చివరగా కనిపించారు. కెరీర్ ముగిసిన తరువాత కృష్ణ ప్రొడక్షన్స్ స్థాపించి మహేష్ బాబు హీరోగా అర్జున్, అతిథి చిత్రాలను తెరకెక్కించాడు. అదేవిధంగా దూకుడు, ఆగడు వంటి సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.
Advertisement
ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణ కి మేనమామ కూతురు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులకే ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రమేష్ బాబు, మహేష్ బాబు కొడుకులు, ప్రియదర్శిని, మంజుల, పద్మావతి కూతుర్లు.కృష్ణ కొన్ని సినిమాలలో విజయ నిర్మలతో కలిసి పని చేశారు. ఈ సమయంలో వారిద్దరూ ఒకరికొకరు ఇష్టపడారు. ఇందిరా దేవి అనుమతితో కృష్ణ, విజయ నిర్మలను పెళ్లాడారు. విజయ నిర్మల కూడా 2019లో మరణించారు. ఇక ఇటీవలే ఇందిరా దేవి మరణించారు. తాజాగా సూపర్ స్టార్ కూడా మరణించారు. 2022లో సూపర్ స్టార్ ఫ్యామిలీ బ్యాడ్ అనే చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితి మరే ఫ్యామిలీకి కూడా రాకూడదని సూపర్ స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read : మహేష్ బాబు కుటుంబంలో వరుస మరణాలకు కారణం ఆ శాపమేనా..?