Home » న‌ర‌సింహనాయుడు సినిమాకు తెర‌వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా..? టైటిల్ తో పాటూ క‌థ మొత్తం ఎందుకు మార్చారంటే..?

న‌ర‌సింహనాయుడు సినిమాకు తెర‌వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా..? టైటిల్ తో పాటూ క‌థ మొత్తం ఎందుకు మార్చారంటే..?

by AJAY
Ad

బాలకృష్ణ బి. గోపాల్ కాంబినేషన్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక వీరి కాంబినేషన్ లోనే 2001 సంవత్సరంలో నరసింహనాయుడు సినిమా వ‌చ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించ‌గా సిమ్రాన్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి, కే .విశ్వనాథ్, బ్రహ్మానందం ముఖ్యపాత్రల‌లో నటించారు. ఈ సూపర్ హిట్ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఆడియో సైతం అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Advertisement

ఇక బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ కథను అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 25 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అప్పట్లో సంచల విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా విషయంలో తెర వెనక చాలా కథ నడిచింది. బాలకృష్ణ బి.గోపాల్ దర్శకత్వంలో రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత మూడో సినిమాను అనుకున్నారు.

Advertisement

narasimhanayudu

narasimhanayudu

అయితే మొదట బి. గోపాల్… పోసాని కృష్ణమురళి అందించిన కథతో అయోధ్య రామయ్య అనే సినిమా తెర‌కెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి ముహూర్తపు సన్నివేశానికి కూడా తీశారు. ముహూర్తపు సన్నివేశం చూసేందుకు బాలయ్య బాబు అభిమానులు భారీగా స్టూడియోకు చేరుకున్నారు. అక్కడ జన ప్రభంజనాన్ని చూసిన బి గోపాల్ ఖచ్చితంగా మూడో సినిమా కూడా హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆలోచనలో పడి రచయిత చిన్ని కృష్ణకు ఫోన్ చేసి కథను రెడీ చేయాలని చెప్పారు. దాంతో చిన్ని కృష్ణ బీహార్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా సినిమా కథను రాసుకున్నారు. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ సినిమాకు మాటలు రాయడంతో పాటు చిన్న చిన్న మార్పులు చేర్పులు సూచించారు. దాంతో అయోధ్య రామయ్య కథను పక్కనపెట్టి నరసింహనాయుడు సినిమా తెర‌కెక్కించ‌గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Visitors Are Also Reading