తొట్టెంపూడి వేణు గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా వేణు స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, పెళ్లాం ఊరెళ్లితే, ఖుషి ఖుషీగా, చెప్పవే చిరుగాలి, గోపి, గోపిక, గోదావరి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సుంపాదించుకున్నారు. హాస్యంతో గిలిగింతలు పెట్టే ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు 9ఏళ్ల తరువాత రామారావు ఆన్‌డ్యూటీ అనే చిత్రంలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా శరత్ మండవ తెరకెక్కించిన చిత్రం. జులై 29న విడుదలవ్వనున్నది. ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను పంచుకున్నారు వేణు.
సినిమాలకే తొలి ప్రాధాన్యతను ఇస్తానని, అనివార్య కారణాల వల్ల కొద్ది రోజులు నటనకు దూరంగా ఉన్నా మళ్లీ ఇన్ని రోజుల తరువాత నటించడం చాలా సంతోషంగా ఉంది. రామారావు ఆన్‌డ్యూటీ తో పాటు పారా హుషార్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించాను. ఈ సినిమా దర్శక, నిర్మాతలు నాకు చాలా సార్లు ఫోన్ చేసి నటించమని అడిగినా ముందు నేను ఒప్పుకోలేదు. ఈ చిత్రంలో నటించకపోయినా పర్వాలేదు. ఒకసారి కలుద్దామని దర్శకుడు శరత్ మండవ సందేశం పంపించారు. అలా ఒకసారి మీట్ అయ్యారు. మీకు నమ్మకం ఉంటే చేయండి అని చెప్పారు. ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చడంతో రెండు, మూడు సార్లు శరత్‌తో చర్చించి నటించేందుకు ఓకే చెప్పాను. అంతకు ముందు వేరే కథలు విన్నప్పటికీ అనుకోకుండా ఇది పట్టాలెకెక్కింది.
ఈ సినిమాలో సీఐ మురళీగా పవర్ పుల్ పాత్రలో కనిపిస్తాను. నేను ఎలా నటించానో ప్రేక్షకులే చెప్పాలి. ఆయన ఓ పవర్ హౌజ్ ఎంతో సరదాగా ఉంటాడు. నటనకు సంబంధించి ఏ విషయాన్ని అయినా రవితేజ ఇట్టే పట్టేస్తాడు. ఆయన పని పై స్పష్టత ఉన్న వ్యక్తి. ఆయనతో నేను కలిసి నటించిన సన్నివేశాలన్ని మీ అందరినీ మెప్పిస్తాయి అని చెప్పుకొచ్చాడు.
Also Read :
ఒక “స్త్రీ” పరాయి “పురుషున్ని” ఎప్పుడు కోరుకుంటుందో మీకు తెలుసా..?
పెన్ను పోయిందని ఎంపీ ఫిర్యాదు.. దాని విలువ ఎంతంటే..?