Home » ఆ నలుగురు స్టార్ హీరోలే.. కానీ ఏఎన్నార్ తో జతకట్టి అట్టర్ ఫ్లాప్.. కారణం..?

ఆ నలుగురు స్టార్ హీరోలే.. కానీ ఏఎన్నార్ తో జతకట్టి అట్టర్ ఫ్లాప్.. కారణం..?

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీని ఏలిన హీరోలలో ఏఎన్ఆర్ ఒకరు. ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అప్పట్లో ఏఎన్ఆర్ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన చేసిన చాలా చిత్రాల్లో ప్రేమ అనేది ప్రత్యేకంగా ఉండేది. ప్రేమకథ తో చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఏ ఎన్ఆర్ వయసు మీద పడ్డాక టాలీవుడ్ లోని పలువురు హీరోలతో అప్పట్లో సినిమా చేశారు. కానీ ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం..

వెంకటేష్-ఏఎన్ఆర్ :

Advertisement


ఏఎన్ఆర్ వెంకటేష్ కలిసి “బ్రహ్మ రుద్రులు” అనే సినిమాలో నటించారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఏఎన్ఆర్ -నాగార్జున :


తన కొడుకు నాగార్జునతో కలిసి “ఇద్దరూ ఇద్దరే” సినిమాలో నటించారు. తండ్రి కొడుకు ల కాంబినేషన్ అనేసరికి భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేకపోయింది.

Advertisement

ఏఎన్ఆర్-మెగాస్టార్ :

తర్వాత మెగా స్టార్ తో కలిసి నాగేశ్వరావు “మెకానిక్ అల్లుడు” అనే సినిమాలో నటించారు. దీన్ని బి.గోపాల్ తెరకెక్కించ గా ఇందులో చిరంజీవి జోడీగా విజయశాంతి నటించింది. రొటీన్ స్టొరీ అవడంతో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

ఏఎన్ఆర్-బాలకృష్ణ :


“గాండీవం” అనే సినిమాలో బాలకృష్ణ మరియు ఏఎన్నార్ కలిసి నటించారు. ఇందులో మోహన్ లాల్ కూడా ఉన్నారు. ఎన్నో అంచనాల మధ్య థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.
ఇలా అందరూ స్టార్ హీరోలే అయినా వీరితో ఏఎన్నార్ నటించారు. కానీ ఇందులో ఏ సినిమా కూడా హిట్ కాలేదట.

ALSO READ;

Visitors Are Also Reading