Home » “ఊ అంటావా” సాంగ్ వారి లోపాలను బయటపెట్టేందుకు చేశానంటున్న సమంత..!!

“ఊ అంటావా” సాంగ్ వారి లోపాలను బయటపెట్టేందుకు చేశానంటున్న సమంత..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత చేతికి అందిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంటుంది. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంతా పై అనేక ట్రోల్స్ వచ్చాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా తన టాలెంట్ ఎంటో నిరూపించుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ, హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. అప్పటివరకు హీరోయినుగా అనేక పాత్రలు చేసుకుంటూ వచ్చిన సమంత “ఊ అంటావా”.. అనే సాంగు చేసి ఇండస్ట్రీలో మరొక రికార్డు క్రియేట్ చేసుకుంది.

Advertisement

ఎంతో మంది యువతకు చెమటలు పట్టించిన సామ్ తను ఈ పాట చేయడానికి కారణం ఏంటో తెలియజేసింది.. కాఫీ విత్ కరణ్ షోలో ఆమె మాట్లాడుతూ నేను చైతన్య విడిపోయిన సమయంలో నాపై అనేక నెగిటివ్ ప్రచారాలు వచ్చాయని అన్నారు.. ఆ కామెంట్లపై నేను స్పందించడానికి నాదగ్గర జవాబు లేదని చెప్పారు. నేను ఓపెన్ గా ఉండాలని మా విడాకుల విషయాన్ని బయట పెట్టానని చెప్పుకొచ్చారు. విషయం బయటకు వచ్చాక పురుషుల నుంచి అనేక అభ్యంతరాలు ఎదురయ్యాయని, సమంతా స్పెషల్ సాంగ్స్ కు ఓకే చెప్పడం ఏంటని అనేక ప్రశ్నలు వచ్చాయని అన్నారు. వీటన్నింటికి బదులు ఇవ్వడం కోసమే ఈ తాను ఈ సాంగ్ చేయాల్సి వచ్చిందని అన్నారు.

Advertisement

అలాగే ఈ పాట నాకు ఎంతో నచ్చిందని పురుషాధిక్య సమాజంలో పురుషుల యొక్క లోపాలను ఎత్తి చూపడానికి “ఊ అంటావా” సాంగు సరైందని నేను భావించాలని సమంత కామెంట్ చేశారు. నాలాంటి సెలబ్రిటీ చెప్తే ఈ సాంగ్ అందరికీ చేరువ అవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో కరణ్ జోహార్ భర్త నుంచి విడిపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని ప్రశ్నించగా నా భర్త కాదు మాజీ భర్త అని సమాధానమిచ్చారు సమంత. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:

Visitors Are Also Reading