Home » న‌వ‌రాత్రుల్లో ఉప‌వాసం ఉంటున్నారా..? అయితే ఇలా చేయకండి..!

న‌వ‌రాత్రుల్లో ఉప‌వాసం ఉంటున్నారా..? అయితే ఇలా చేయకండి..!

by Anji
Published: Last Updated on
Ad

సోమ‌వారం నుంచి న‌వ‌రాత్రులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సమ‌యంలో మీరు ఉప‌వాసం ఉన్న‌ట్ట‌యితే ఆహారం, పానీయాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించండి. మీరు 9 రోజుల పాటు ఉండే ఉప‌వాసంలో ఆహారాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోక‌పోతే.. అప్పుడు శ‌రీరంలో బ‌ల‌హీన‌త ఏర్ప‌డుతుంది. వ‌ర్షాకాలంలో త‌క్కువ నీరు తాగితే డీ హైడ్రేష‌న్ ముప్పు ఎక్కువ‌గా ఉంటుంది.

Advertisement

న‌వ‌రాత్రి స‌మ‌యంలో త‌రుచు టీ, కాఫీని ఎక్కువ‌గా తీసుకుంటుంటారు. ఈ సమ‌యంలో టీ, కాపీలు తీసుకోవ‌డం వ‌ల్ల మీ శ‌రీరంలో ప‌లు రోగాలు సంభ‌వించే అవ‌కాశ‌ముంది. టీ, కాఫీ శ‌రీరంలో డీ హైడ్రేష‌న్ క‌లిగిస్తాయి. దీని కార‌ణంగా అలిసిపోయిన‌ట్టు, బ‌ల‌హీన‌మైన అనుభూతి పొందుతారు. ఉప‌వాస స‌మ‌యంలో ఆహారాల‌కు దూరంగా ఉండండి. ఏయే విష‌యాల‌ను నివారించాలో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

ఉప‌వాసం ఉన్న‌ప్పుడు టీ, కాఫీ తాగ‌కూడ‌దు. లిక్విడ్ డైట్ శ‌రీరాన్ని హైడ్రెట్‌గా ఉంచుతుంది. టీ, కాఫీ అనేది శ‌రీరంలో డీ హైడ్రేష‌న్ స‌మ‌స్య‌ను పెంచే లిక్విడ్ పుడ్. ఫాస్ట్ స‌మ‌యంలో లిక్విడ్ డైట్ తినాల‌నుకుంటే నీరు, ర‌సం, జున్ను, ల‌స్సీ, కొబ్బ‌రి నీరు, నిమ్మ‌ర‌సం, పాలు తాగ‌డం చేయాలి. ఇలాంటి ఆహారాలు శ‌రీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. శ‌రీరం బ‌ల‌హీన‌త‌ను తొల‌గిస్తాయి. లిక్విడ్ డైట్ శ‌రీరంలో టాక్సిన్ ను తొలిగిస్తుంది. మూత్ర పిండాల ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. ఉప‌వాస స‌మ‌యంలో ప్ర‌జలు త‌రుచూ సోడా, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, లెమ‌న్ టీ లేదా ఐస్ టీ, ఎన‌ర్జీ డ్రింక్స్ తీసుకుంటారు.

Advertisement

Also Read :  మీ జుట్టు ఊడిపోతుందా..? అందుకు అస‌లు కార‌ణం ఇదే.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..!

ఈ డ్రింక్స్ తీసుకోవ‌డం వ‌ల్ల యూరిన్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంద‌ని, దాని వ‌ల్ల శ‌రీరంలో డీ హైడ్రేష‌న్ స‌మ‌స్య ఏర్ప‌డుతుంద‌ని చాలా ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి అయింది. ఈ పానీయాల‌ను అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, నోరు పొడిబారుతుంది. శ‌రీరాన్ని హైడ్రేట్‌గా ఉంచ‌డానికి ఉప‌వాస స‌మ‌యంలో మ‌నం త‌ర‌చు తీపి ర‌సాల‌ను రోజు రెండు, మూడు సార్లు తీసుకుంటాం. కృతిమ పండ్ల ర‌సాలు శ‌రీరంలో డీ హైడ్రేష‌న్ స‌మ‌స్య‌ల‌ను క‌లిగిస్తాయి. ఈ పానీయాల‌కు కాస్త దూరంగా ఉండండి. ఉప‌వాసం స‌మ‌యంలో క‌నీసం 2 నుంచి 3 లీట‌ర్ల నీరు తాగాలి. నిమ్మ‌నీరు, గ్రీన్ టీ, పుదీనా నీరు, యాల‌కుల టీ, స్మూతిస్‌, కొబ్బ‌రి నీరు వంటి ఉప్పు లేని మ‌జ్జిగ‌, త‌క్కువ కేల‌రీల పానీయాల‌ను ప్ర‌య‌త్నించండి.

Also Read : ప్ర‌తి రోజూ ప‌ర‌గ‌డుపున వాల్ న‌ట్స్ తింటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

Visitors Are Also Reading