Home » ఈ ఫోటోలోని అమ్మాయి ఒకప్పుడు స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ అని మీకు తెలుసా..?

ఈ ఫోటోలోని అమ్మాయి ఒకప్పుడు స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ అని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala

ఏమీ తెలియని చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందిన చైల్డ్ ఆర్టిస్ట్ లు ఎంతోమంది ఉన్నారు.. ఇందులో కొంత మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న, మరికొంతమంది బిజినెస్ లు ఇతర వర్క్ లో బిజీగా ఉన్నారు.. అలాంటి వారిలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది. తన క్యూట్ లుక్స్ తో ఎంతో చక్కగా నటిస్తూ అలరించింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రం చాలా పేరు తెచ్చుకున్న అమ్మాయి పెరిగి పెద్దయిన తర్వాత అంతగా ఇండస్ట్రీలో కనిపించలేదు.

also read:అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌కుండా పాటించండి..!

అయితే ప్రస్తుతం ఆ చైల్డ్ ఆర్టిస్ట్ త్వరలో పెళ్లి చేసుకో బోతోందని తెలుస్తోంది.. మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు సుహాని కలిత.. ఈ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే.. ఈ సినిమా ద్వారా ఈ అమ్మాయికి చాలా పాపులారిటీ వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎదురులేని మనిషి, రామాయణం,గణేష్,ప్రేమించే మనసు,నా హృదయంలో నిదురించే చెలి,మనసంతా నువ్వే ఇలా అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. కట్ చేస్తే 2010లో హీరోయిన్ గా సుకుమారుడు, స్నేహగీతం వంటి సినిమాల్లో నటించింది.

ఈ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు లభించలేదు. హిందీలో కూడా నటించిన అక్కడ కూడా గుర్తింపు లేదు. దీంతో ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పింది. ఈ మధ్య కాలంలోనే తనకు ఎంగేజ్మెంట్ అయిందంటూ సోషల్ మీడియా వేదికగా ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసింది ఈ అమ్మడు. తాజాగా తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ ని ఎంజాయ్ చేసే ఫోటోలను తన స్నేహితులతో షేర్ చేసుకుంది.. నెటిజన్లు ఒకప్పుడు చిన్నపిల్లల నటించి మెప్పించిన ఈ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు..

also read:

Visitors Are Also Reading