Home » అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌కుండా పాటించండి..!

అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌కుండా పాటించండి..!

by Anji
Ad

సాధార‌ణంగా మ‌నం పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా నిత్యం మ‌న‌కు అందుబాటులో ఉండే మార్కెట్‌లో ల‌భించే పండ్ల‌లో అర‌టి పండు ఒక‌టి. ఈ అర‌టి పండుకు ఎక్కువ‌గా పేద ప్ర‌జ‌లు తింటుంటారు. ఎందుకంటే అందరికీ అందుబాటులోఉండే ధ‌ర‌లోలోనే ఇది ల‌భిస్తుంది. ఇక ఈ పండ్ల‌లో ఉండే పోష‌కాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇక అర‌టిపండు తిన‌డం ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ దీనిని ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల కూడా కొన్ని సంద‌ర్భాల్లో ఆరోగ్యానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌య్యే ఛాన్స్ ఉంటుంది.

ఇవి కూడా చ‌ద‌వండి :  త‌మ‌న్ మార‌డా..? గాడ్ ఫాద‌ర్ టీజ‌ర్ మ్యూజిక్ ను అక్క‌డ నుండి లేపేశాడంటూ దారుణ‌మైన ట్రోల్స్..!

Advertisement

ఎక్కువ‌గా అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌న వీటితో క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా పని చేస్తాయి. ముఖ్యంగా అర‌టిపండ్ల‌ను తినాల‌నుకుంటే వాలి వ‌ల్ల క‌లిగే ప్ర‌తికూల ప్ర‌భావాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ఎక్కువ‌గా అరటి పండ్ల‌ను తిన‌డం ద్వారా మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య క‌లుగుతుంది. మైగ్రేన్ కి దారి తీస్తుంది. ఇక అరటిపండ్ల‌లో ఉండే ప్ర‌క్టోజ్ ర‌క్తంలో చ‌క్క‌ర స్థాయిల‌ను ఉత్తేజ ప‌రుస్తుంది. ముఖ్యంగా బ‌రువు పెర‌గాల‌నుకునేవారు అరటిపండును తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. అర‌టిపండ్ల‌లో పోటాషియం ఎక్కువ‌గా తీసుకున్న‌ప్పుడు హైప‌ర్కెల్మియాకి దారి తీస్తుంది.

Advertisement


వీటిలో ఉండే ఫైబ‌ర్ వ‌ల్ల పొట్ట‌లో గ్యాస్ పేరుకుపోవ‌డంతో పాటు క‌డుపు ఉబ్బ‌రంగా కూడా అనిపిస్తుంటుంది. ఇంకా అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా తిన‌డం ద్వారా దంత క్ష‌య స‌మ‌స్య కూడా కలిగే అవ‌కాశం ఉంది. న‌రాల వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపించి నిద్ర ఎక్కువ‌గా వ‌చ్చేవిధంగా చేస్తుంది. అరటిపండు ఆరోగ్య‌క‌ర‌మైన‌దే అయిన‌ప్ప‌టికీ ఏదైనా మోతాదుకి మించి తిన‌డం హానిక‌ర‌మే అనే విష‌యాన్ని త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి. కాబ‌ట్టి అర‌టి పండ్ల‌ను రోజుకు ఒక‌టి లేదా రెండు వ‌ర‌కు తిన‌వ‌చ్చు. ఇక అంత‌కు మించి తింటే మాత్రం దుష్ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఈ పండ్లను తినేట‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త ఉంటే అంత మంచిది.

ఇవి కూడా చ‌ద‌వండి : మీరు రాత్రి పూట అన్నం బ‌దులు చ‌పాతీలు తింటున్నారా..? అయితే ఈ విష‌యం త‌ప్ప‌కుండా తెలుసుకోండి..!

 

Visitors Are Also Reading