Home » Venu Swamy: ప్రభాస్ కి అందుకే పెళ్లి జరగడం లేదు

Venu Swamy: ప్రభాస్ కి అందుకే పెళ్లి జరగడం లేదు

by Anji
Ad

బాహుబలి మూవీస్ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు వచ్చినప్పటికీ వీటితో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కానీ గత ఏడాది సలార్ సీజ్ ఫైర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. కలెక్షన్ల సునామి సృష్టించి.. అతడిని హిట్ ట్రాక్ ఎక్కించింది. 

Advertisement

కొంత కాలం వరుస సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ, సలార్ 2, ది రాజా సాబ్, స్పిరిట్ వంటి సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇదిలా ఉంటే. . దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న ప్రభాస్ జాతకం గురించి ఆ మధ్య ఓ హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి కారణం ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అతని జాతకంలో లోపాలు ఉన్నాయని.. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు ఉంటాయని చెప్పడమే. తాజాగా మరోసారి ఆయన ప్రభాస్ పెళ్లి, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

 

ప్రభాస్ గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో మాట్లాడిన వేణు స్వామి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ” నేను పదమూడేళ్ల వయస్సులో ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. రెబల్ స్టార్  కృష్ణంరాజు నాకు చాలా పరిచయం. వాళ్ల ఫ్యామిలీలోని అందరి జాతకాలు నాకు బాగా తెలుసు” అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. ప్రభాస్ ఆరోగ్యం, సినిమాల గురించి పలుమార్లు స్పందించిన వేణు స్వామి తాజాగా అతడు సినిమాల ఎంట్రీ గురించి మాట్లాడారు. ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ ఎలా చేశాడో నాకు తెలుసు.

ఊరికే సోషల్ మీడియాలో ఆయన అభిమానులు నన్ను ట్రోల్స్ చేస్తారు. కానీ నాకు చాలా విషయాలు అతని గురించి తెలుసు అని వెల్లడించారు. ప్రభాస్ కి ఎప్పుడో పెళ్లి వయస్సు వచ్చేసింది కదా.. ఇప్పటివరకు అతనికి పెళ్లి ఎందుకు జరగలేదు.. ఇది కూడా నాకు తెలుసు అన్నారు. ప్రభాస్ జాతకంలో సమస్యలు ఉన్నాయని.. అందుకే ఇలా జరుగుతున్నాయని వేణు స్వామి వెల్లడించారు. 

Also Read :  ఎంజీఆర్ తొక్కేసిన న‌టుడిని ఎన్టీఆర్ పైకి తీసుకొచ్చారు.. ఆ న‌టుడు ఎవ‌రంటే..?

Visitors Are Also Reading