Home » మొదటి భార్యకు అందుకే విడాకులు ఇచ్చాను.. నటుడు సురేష్ కామెంట్స్ వైరల్..!

మొదటి భార్యకు అందుకే విడాకులు ఇచ్చాను.. నటుడు సురేష్ కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకు అంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో సురేష్ ఒకరు. తొలుత హీరోగా, తరువాత విలన్ గా నటించిన సురేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి సురేష్ మాట్లాడుతూ.. నా మొదటి భార్య పేరు హర్షితా రెడ్డి అని తను మొదటి నుంచి ఇండస్ట్రీలోనే ఉండేదని చెప్పుకొచ్చారు. చదువుకోవాలనే కోరికతో తను నటించడం మానేసిందని వెల్లడించారు సురేష్.

Advertisement

నన్ను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె తన పేరును అనితా సురేష్ అని మార్చుకుందని చెప్పుకొచ్చారు. మాకు ఓ బాబు కూడా పుట్టాడని.. నాతో విడాకులై రెండో పెళ్లి చేసుకున్న తరువాత కూడా ఆమె అదే పేరు కొనసాగిస్తుందని సురేష్ వివరించారు. ఒకప్పుడు నా భార్య ఇప్పుడు నా స్నేహితురాలు స్థానంలో ఉందని తెలిపారు. వరుస మారిందేమో కానీ ఆప్యాయత మాత్రం మారలేదని కామెంట్స్ చేశారు సురేష్. విడిపోవడానికి మా మధ్య ఎలాంటి గొడవలు జరుగలేదని ఆమెకు పెద్ద చదువులు చదవాలని అమెరికాలో సెటిల్ అవ్వాలనే కోరిక ఉండేదని.. నేను సినిమాల్లో బిజీగా ఉండటంతో తనతో రాను అని చెప్పేశానని అందుకే విడిపోయామని తెలిపారు సురేష్.

Advertisement

ఆస్తులను సమానంగా పంచుకున్నామని చెప్పుకొచ్చారు సురేష్. నా భార్య అమెరికా వెళ్లి పోయి అక్కడే చదువుకుందని.. రెండో పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిందని కామెంట్స్ చేశారు. నేను కూడా దర్శక రచయిత్రీ రాశిని రెండో పెళ్లి చేసుకున్నానని సురేష్ చెప్పుకొచ్చారు. నేను అమెరికా మొదటి భార్య ఇంట్లో ఉంటానని వాళ్లు ఇండియా వస్తే.. ఇంట్లో ఉంటారని సురేష్ కామెంట్స్ చేశారు. సురేష్ వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Visitors Are Also Reading