తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు అంటే.. ఆయన సాధించిన విజయాలు.. ఆయన గెలుచుకున్న అవార్డులను చూస్తే.. మనకు ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే ఈయన చేసిన వరుస సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా స్టార్ హీరోగా ఆయనను చాలా టాప్ రేంజ్ లో కూర్చొబెట్టాయనే చెప్పాలి.
Advertisement
హిట్లర్ మూవీ అప్పట్లో మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ముందు ఐదారు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ మూవీతో హిట్ కొట్టి ఎలాగైనా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్య దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీలో చిరంజీవి నాన్నగా దాసరి నారాయణరావు ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తరువాత పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న తరుణంలోనే దాసరి నారాయణరావు కొంత మందితో ఈ మూవీ పెద్దగా సక్సెస్ అయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు. ఎందుకు అంటే.. సిస్టర్స్ సెంటిమెంట్ తో మే లో డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియడం లేదు అంటూ కొంతమంది దగ్గర చెప్పాడట.
Advertisement
అంతకు ముందే వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో ఇప్పుడు ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే విధంగా ఉందని దాసరి నారాయణరావు గారు కొంత మంది చెప్పినట్టుగా తెలుస్తోంది. దాసరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఈ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో చిరంజీవి మరోసారి తన సత్తాను చాటుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.
Also Read : స్టూడియోకు స్థలం కేటాయింపు.. విమర్శలపై మహి వి రాఘవ్ క్లారిటీ ..!